ఫిట్నెస్ నిత్యజీవితంలో ఒక భాగం -స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్.

ఫిట్నెస్ అనేది నిత్యజీవితంలో ఒక భాగంగా ఏర్పాటు చేసుకొని ఆరోగ్యవంతులుగా ఉండాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ అన్నారు. ఆజాదికా అమృత్ మహోత్సవ్ లో భాగంగా ఫిట్ ఇండియా ఫ్రీడమ్ రన్ ను మంగళవారం రోజున స్థానిక ఇందిరా ప్రియదర్శిని స్టేడియం లో ప్రారంభించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ, నిత్య జీవితంలో వ్యాయామం, క్రీడలలో పాల్గొనడం ద్వారా ఆరోగ్యవంతులుగా ఉంటారని అన్నారు. ఈ ఫిట్ ఇండియా ఫ్రీడమ్ రన్ లో యువత ఉత్సాహంతో పాల్గొనడం అభినందనీయమని అన్నారు. గ్రామీణ ప్రాంతాలలో పల్లె ప్రకృతి వనాలను ఏర్పాటు చేయడం జరిగిందని, ఉపాధి హామీ పథకం కింద గ్రౌండ్ లను ఏర్పాటు చేసుకొని స్థానిక క్రీడలు అయినటువంటి కబడ్డీ, ఖోఖో వంటివి నిర్వహించి పాల్గొనాలని అన్నారు. క్రీడలలో ఉత్సాహం కలిగిన వారికీ కోచ్ ల ద్వారా శిక్షణ ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా యువజన సంక్షేమ అధికారి వెంకటేశ్వర్లు, గిరిజన సంక్షేమ ఆశాఖ PET అధికారి పార్థసారథి, కోచ్ లు, బి.గోవర్ధన్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

Share This Post