ఫిబ్రవరి నెల నుండి భరత్ సర్వేపల్లి బృందం ఆధ్వర్యంలో మరింత విస్తరించబడ్డ ఉచిత సేవలు::జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంత్

ప్రచురణార్థం-2
రాజన్న సిరిసిల్ల, డిశంబర్ 19: సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంత్ అధ్యక్షతన ఆధ్వర్యంలో భరత్ సర్వేపల్లి బృందంతో అసంక్రమిత వ్యాధుల నియంత్రణ పై సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, రాష్ట్ర ఐటీ, పురపాలన, వాణిజ్య శాఖల మంత్రి కల్వకుంట్ల తారక రామారావు మార్గనిర్దేశంలో భరత్ సర్వేపల్లి బృందం, హైదరాబాద్ అసంక్రమిత వ్యాధుల నియంత్రణ(NCD) కార్యక్రమంలో భాగంగా జిల్లా ప్రజలకు మరిన్ని ఉచిత సేవలు విస్తరించాలనే ఉద్దేశంతో జిల్లాలో పర్యటించడం జరిగిందని తెలిపారు. ఇందులో భాగంగా ప్రస్తుతము ఓరల్, బ్రెస్ట్, సర్వైకల్ క్యాన్సర్ కు సంబంధించిన వాటి పరీక్షలు జరుగుతున్నాయన్నారు. భరత్ సర్వేపల్లి బృందం సహాయంతో ఈ కార్యక్రమాన్ని మరింత విస్తరించడం వల్ల కీమోథెరపీ, మామోగ్రఫీ లాంటి క్యాన్సర్ సంబంధిత పరీక్షలు సిరిసిల్ల జిల్లా ప్రజలకు అందుబాటులోకి వస్తాయని ఆయన అన్నారు. మొదటగా ఆరోగ్యశాఖ సిబ్బందికి శిక్షణ కార్యక్రమాలు ఏర్పాటు చేసి అనంతరం ఫిబ్రవరి నెల నుండి భరత్ సర్వేపల్లి బృందం ఆధ్వర్యంలో మరింత విస్తరించబడ్డ ఉచిత సేవలు అందించడం జరుగుతుందని ఆయన తెలిపారు.
ఈ సమావేశంలో అదనపు కలెక్టర్(స్థానిక సంస్థలు) బి. సత్యప్రసాద్, భరత్ సర్వేపల్లి, డా. సాయిమురళీ, పి.అనురాగ్ , శివంగిదాస్, తదితరులు పాల్గొన్నారు.

Share This Post