ఫీవర్ సర్వే ద్వారా అనుమానితులను గుర్తించి చికిత్స అందించాలి :: జిల్లా కలెక్టర్ జి. రవి

ప్రచురణార్థం…..1

తేదిః 18-01-2022

ఫీవర్ సర్వే ద్వారా అనుమానితులను గుర్తించి చికిత్స అందించాలి :: జిల్లా కలెక్టర్ జి. రవి
ఫీవర్ సర్వే ద్వారా అనుమానితులను గుర్తించి చికిత్స అందించాలి :: జిల్లా కలెక్టర్ జి. రవి

జగిత్యాల, జనవరి, 18: జిల్లాలో ఫీవర్ సర్వే నిర్వహించి తద్వారా అనుమానితులను గుర్తించి కోవిడ్ నిర్దారణ పరీక్షలను నిర్వహించాలని, కోవిడ్ బాదితులు హొం ఐసోలేషన్ లో ఉండేలా చూడడంతో పాటు, వారి ప్రైమరి కాంటాక్ట్ అయిన వారు జాగ్రత్త పడాలని సూచించాలని తెలిపారు. జిల్లాలో కోవిడ్ విజృంబించకుండా చర్యలు తీసుకోవడంతో పాటు, వ్యాక్సినేషన్ ప్రక్రియను కూడా సజావుగా పూర్తయ్యేలా చూడాలని అన్నారు.

ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ,రెండవ డోస్ తీసుకున్న 39 వారాలు లేదా 9 నెలలు పూర్తయిన ప్రంట్ లైన్ వర్కర్ లకు బూస్టర్ డోస్ అందించేలని జిల్లా కలెక్టర్ జి. రవి అధికారులను ఆదేశించారు. మంగళవారం ఉదయం జిల్లా వైద్యాధికారి, మెడికల్ సూపరింటెండెంట్లు మరియు ఇతర వైద్యాధికారులతో కోవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియపై జిల్లా కలెక్టర్ శిభిర కార్యాలయం నుండి జూమ్ వెబ్ వీడియో కాన్పరెన్స్ ద్వారా సమీక్షించారు.

గ్రామస్థాయి నుండి జిల్లా స్థాయి వరకు అధికారులు ఫీవర్ సర్వే సక్రమంగా జరిగేలా చూడాలని, నిర్దారణ పరీక్షలను అవసర మేర పెంచాలని, ప్రతిరోజు 4వేల నిర్దారణ పరీక్షలను నిర్వహించాలని, పండుగ సందర్బంగా ప్రజలు ప్రయాణాలు, సాముహికంగా ఉన్నందున, ర్యాపిడ్, ఆర్టిపిసిఆర్ పరీక్షలను ఎక్కువ సంఖ్యలో నిర్వహించాలని, గ్రామ, మున్సిపాలిటిలలో ఫీవర్ సర్వే, కోవిడ్ నిర్దారణ పరీక్షలు సక్రమంగా జరిగేలా మున్సిపల్ కమీషనర్లు, యంపిడిఓలు బాద్యత వహించాలని సూచించారు.

జిల్లాలో యాక్టీవ్ కేసులను గుర్తిచి, హోంఐసోలేషన్ వారికి సరైన చికిత్సను అందించేలా క్షేత్రస్థాయిలో నియమించిన సిబ్బంది పర్యవేక్షించాలని అన్నారు. కోవిడ్ కంట్రోల్ రూం ద్వారా ఎప్పటికప్పుడు పాజిటివి కేసులను సమీక్షించాలని,జిల్లా నుండి గ్రామస్థాయి వరకు సానిటేషన్ పనులు సక్రమంగా జరగడంతో పాటు, అవగాహన కార్యక్రమాలు సక్రమంగా జరిగేలా చూడాలని, పేర్కోన్నారు. కోవిడ్ ప్రోటోకాల్ పాటించక పోవడం, మాస్కులు దరించకుండా ఉన్నవారిని గుర్తించి వారికి పెనాల్టీలను విధించాలని ఆదేశించారు.

ఆసుపత్రులలో ఆక్సిజన్, జనరల్ బెడ్ లు, ఐసియూ బెడ్ లు మరియు వెంటిలేటర్ లను అందుబాటులో ఉంచుకోవడంతో పాటు, ఎటువంటి సమస్యలు తలెత్తకుండా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రులలో అందించే కోవిడ్ వైద్య సేవలపై ఎప్పటికప్పుడు తనిఖీలు నిర్వహించి, నివేదికలను సిద్దం చేయాలని పేర్కోన్నారు. కోవిడ్ మొదటి డోస్ వ్యాక్సినేషన్ 100శాతం పూర్తి చేయడంపై కలెక్టర్ సంతృప్తిని వ్యక్తం చేస్తూ, ఇందుకు కృషిచేసిన అధికారులను అభినందిచారు.

జిల్లా వైద్యాధికారి పి. శ్రీధర్ మాట్లాడుతూ, క్షేత్రస్థాయిలో వైద్య సిబ్బంది ఫివర్ సర్వే నిర్వహించాలని, గౌరవ మంత్రివర్యుల ఆదేశాల మేరకు కోవిడ్ నిర్దారణ పరీక్షలను నిర్వహించి, పాజిటివ్ గా నిర్దారణ అయిన వారు హోమ్ ఐసోలేషన్ లో ఉండేలా చూడాలని, వారికి మందులను అందించాలని, ప్రైమరిగా కాంటాక్ట్ అయిన వారికి నిర్దారణ పరీక్షలను నిర్వహించి కోవిడ్ పాజిటివ్ గా నిర్దారణ అయిన వారు హోంఐసోలేషన్ లో ఉండేలా చూడడంలతో పాటు, మెడికల్ కిట్ ను అందించాలని సూచించారు. 26 జనవరి లోగా వ్యాక్సినేషన్ ప్రక్రియను వందశాతం పూర్తిచేయాలని తెలియచేసారు.

జిల్లా పౌరసంబంధాల అధికారి కార్యాలయం, జగిత్యాల చే జారిచేయనైనది.

Share This Post