ఫైళ్ళ నిర్వహణ వేగవంతంగా, పారదర్శకంగా నిర్వహించి పెండింగ్లో లేకుండా చూడాలని జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా కలెక్టర్ కార్యాలయ అధికారులను ఆదేశించారు.

* ప్రచురణార్థం *

జయశంకర్ భూపాలపల్లి నవంబర్ 3 (బుధవారం)

.          ఫైళ్ళ నిర్వహణ వేగవంతంగా, పారదర్శకంగా నిర్వహించి పెండింగ్లో లేకుండా చూడాలని జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా కలెక్టర్ కార్యాలయ అధికారులను ఆదేశించారు. బుధవారం జిల్లా కలెక్టర్ కలెక్టర్ కార్యాలయంలోని వివిధ సెక్షన్లు మరియు ఇతర శాఖల అధికారుల ఛాంబర్ లను తనిఖీ చేసి ఫైళ్ళను పరిశీలించారు. ముందుగా కలెక్టరేట్ లోని వివిధ సెక్షన్ల పరిశీలించి ప్రభుత్వ ప్రాధాన్యత కార్యక్రమాల నిర్వహణకు అధిక ప్రాధాన్యత ఇచ్చి పెండింగ్లో ఉంచకుండా ఎప్పటికప్పుడు పూర్తి చేయాలని అన్నారు. సింగరేణి, జెన్కో, ఇరిగేషన్, నేషనల్ హైవే తదితర ల్యాండ్ అక్విజిషన్ వివరాల ఫైళ్లను ప్రత్యేకంగా పొందుపరచాలని మరియు పెండింగ్లో లేకుండా చూడాలని అన్నారు. ఫైల్స్ ఈ-ఆఫీసులో నిర్వహించేటప్పుడు డిజిటల్ సంతకంతో పంపించాలని అన్నారు. అనంతరం ల్యాండ్ సర్వే, ప్రణాళిక, సమాచార పౌర సంబంధాలు, బీసీ అభివృద్ధి, ఎస్సీ అభివృద్ధి, గ్రౌండ్ వాటర్, పంచాయతీ, పౌరసరఫరాలు, మహిళా శక్తి కేంద్రం తదితర శాఖల కార్యాలయాలను సందర్శించి ఫైళ్లను తనిఖీ చేశారు.

ఈ కార్యక్రమంలో కలెక్టరేట్ ఏవో మహేష్ బాబు, ఏడి సర్వే ల్యాండ్ సుదర్శన్, సిపిఓ కే.సామ్యూల్, డిపిఆర్ఓ బి.రవికుమార్, సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.

డిపిఆర్ఓ జయశంకర్ భూపాలపల్లి జిల్లా గారిచే జారీ చేయడమైనది.

Share This Post