ఫోటోలు : హుజురాబాద్ మండలం సింగాపూర్ లోని పోలింగ్ స్టేషన్ ను పరిశీలించిన జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఆర్ వి కర్ణన్.

 

 

పోలింగ్ కేంద్రాలు ఓటర్లకు సౌకర్యవంతంగా ఉండాలి

జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఆర్ వి కర్ణన్

సింగపూర్ లోని పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన కలెక్టర్
000000

హుజురాబాద్ శాసనసభ నియోజకవర్గం ఉప ఎన్నిక సందర్భంగా ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాలు ఓటర్లకు సౌకర్యవంతంగా ఉండాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఆర్ వి కర్ణన్ అన్నారు. మంగళవారం హుజరాబాద్ నియోజకవర్గం సింగపూర్ లోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో గల17/31, 18/31 పోలింగ్ కేంద్రాలను కలెక్టర్ పరిశీలించారు. ఈ కేంద్రాలు ఓటర్లకు అసౌకర్యంగా ఉన్నందున పక్కనే గల భవనంలోనికి మార్చాలని అధికారులను ఆదేశించారు. కోవిడ్ నిబంధనలను పాటించాలని సూచించారు. పోలింగ్ రోజు ఓటర్ల రద్దీని నివారించేందుకు కేంద్రాలను సౌకర్యవంతంగా ఉన్న గదుల్లోకి మార్చాలని తెలిపారు. ఓటర్లు ఎండలో నిలబడకుండా ఉండేందుకు షామియానాలు, కుర్చీలు వేయించాలని అన్నారు. ఓటర్లు కోవిడ్ నిబంధనల ప్రకారం తప్పనిసరిగా మాస్కులు ధరించి, భౌతిక దూరం పాటిస్తూ ఓటు హక్కు వినియోగించుకునేలా చూడాలని అన్నారు.

ఈ కార్యక్రమంలో హుజురాబాద్ రిటర్నింగ్ అధికారి సిహెచ్. రవీందర్ రెడ్డి, తాసిల్దార్ రామ్ రెడ్డి, పంచాయతీ రాజ్ ఇంజనీరింగ్ అధికారి తదితరులు పాల్గొన్నారు.

 

Share This Post