ఫోటో ఓటర్ జాబితా సవరణ కార్యక్రమం 2022 లో భాగంగా ఓటర్ నమోదుకు,మార్పులు చేర్పులకు వచ్చిన దరఖాస్తులను పరిష్కరించి పరిపూర్ణమైన జాబితా రూపొందించాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి డా శశాంక్ గోయల్ తెలిపారు

2022 ఓటరు జాబితా రూపకల్పన, 2022 జనవరి 1వ తేదీ నాటికి 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరు  నూతన ఓటరుగా నమోదు కావడం,  ఎన్నికల గుర్తింపు కార్డులు జారీ, ఓటరు జాబితాలో మార్పులు చేర్పులుకు నిర్ణీత ప్రొఫార్మాలో దరఖాస్తు చేయుట తదితర అంశాలపై రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి శనివారం అన్ని జిల్లాల ఎన్నికల అధికారులలో వీడియో కాన్ఫరెన్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రత్యేక ఓటరు నమోదు కార్యక్రమాలపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు ప్రత్యేకంగా స్వీప్ కార్యక్రమాలు నిర్వహించాలని చెప్పారు. నూతన ఓటరు నమోదు, ఓటరు జాబితాలో మార్పులు చేర్పులకు ఆన్ లైన్లో,నేరుగా వచ్చిన ఫారం 6,7,8,8 ఏ దరఖాస్తులను పరిష్కరించి ఓటర్ జాబితా ఆప్ డేట్ చేయాలని అన్నారు. 2021అక్టోబర్ 14 నాటికి పోలింగ్ కేంద్రాల హేతు బద్దీకరణ చేసి నివేదిక పంపించాలని అన్నారు.2021 నవంబర్ 1న ఎన్నికల ముసాయిదా జాబితా ప్రకటించనున్నట్లు,అనంతరం వచ్చిన దరఖాస్తులు,అభ్యంతరాలు తుది జాబితా  2022 జనవరి 5 లోగా ఓటర్ జాబితా లో ఆప్ డేట్ చేయాలని అన్నారు. ఎలక్టోరల్ లిటరసీ క్లబ్ లు సమర్థవంతంగా పని చేయాలని అన్నారు. ఎన్నికల కమిషన్ ఆదేశాల ననుసరించి ఈ.వి.యం గోదాములను ప్రతి నెల తనిఖీ చేసి నివేదికలను ఎన్నికల అధికారి కార్యాలయానికి పంపాలని చెప్పారు.
ప్రజాస్వామ్య దేశంలో ఓటుకు ఉన్న ప్రాధాన్యతననుసరించి తప్పులు లేని పరిపూర్ణమైన ఓటరు జాబితాను తయారు చేయు విదంగా కృషి చేస్తామని జిల్లా ఎన్నికల అధికారి,జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ తెలిపారు.
ఈ వీడియో కాన్ఫరెన్సు లో ఎన్నికల డి.టి.విజయ్ తదితరులు పాల్గొన్నారు.
*కొత్తగా ఓటర్ గా నమోదు అయిన వారు ఈ ఎపిక్ కార్డు డౌన్ లోడ్ చేసుకోవాలి*
ఫోటో ఓటర్ జాబితా సవరణ 2021 కార్యక్రమంలో భాగంగా తర్వాత  ఓటరు గా నమోదు చేసుకున్న వారు ఈ ఎపిక్ కార్డు డౌన్ లోడ్ చేసుకోవచ్చని జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ తెలిపారు. యూనిక్ నంబర్ ద్వారా 2021 ఫోటో ఓటర్ జాబితా లో ఓటర్ గా నమోదు చేసుకున్న వారు ఫోన్ నంబర్ ద్వారా ఈ ఎపిక్ డౌన్ లోడ్ చేసుకోవాలని తెలిపారు.

Share This Post