ఫ్రీడం రన్ విజయవంతం చేయాలి

ఫ్రీడం రన్ విజయవంతం చేయాలి

ఈ నెల 11న అంబేద్కర్ చౌరస్తా నుండి ఆర్ట్స్ కళాశాల వరకు 30 వేల మందితో ఫ్రీడం రన్

అదనపు కలెక్టర్ శ్యాంప్రసాద్ లాల్

0 0 0 0

     75వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్బంగా చేపడుతున్న భారత స్వాతంత్ర వజ్రోత్సవాలలో భాగంగా చేపట్టనున్న ఫ్రీడం రన్ ను 30వేల మందితో నిర్వహించి విజయవంతం చేయాలని జిల్లా అదనపు కలెక్టర్ జీవి శ్యాంప్రసాద్ లాల్ అన్నారు.

సోమవారం సాయంత్రం అదనపు కలెక్టర్ చాంబర్ లో భారత స్వాతంత్ర వజ్రోత్సవాలలో బాగంగా జిల్లాలో ఈనెల 11, 13 మరియు 14వ తేదిలలో అదే విధంగా 16,17వ తేదిలలో మండల స్థాయిలో చేపట్టవలసిన కార్యక్రమాల కార్యచరణపై సంబంధిత అధికారులు, వివిధ స్పోర్ట్స్ అసోసియోషన్ సభ్యులతో సమీక్షించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ జిల్లా కేంద్రంలో ఈనెల 11వ తేదిన కోర్టు చౌరస్తా (అంబేడ్కర్ విగ్రహం) నుండి ఆర్ట్ కళాశాల వరకు 30వేల మందితో ఫ్రీడంరన్ నిర్వహించాలని ఇందులో పాఠశాల, కళాశాలల విద్యార్థులు,క్రీడాకారులు, కళాకారులు, విద్యార్థులు పాల్గొనేలా చూడాలని ఆయన ఆదేశించారు. ఈ నెల 13వ తేదిన అంబేడ్కర్ స్టేడియం నుండి టవర్ సర్కిల్ వరకు ర్యాలీని నిర్వహించాలని, 14వ తేదిన అమరవీరుల స్థూపం నుండి ఆడిటోరియం వరకు కళాకారులచే ర్యాలీ అనంతరం ప్రదర్శన నిర్వహించి జానపద గేయాలను ఆలపించేలా చూడలాని అన్నారు. ఈ కార్యక్రమాలను ఉదయం 10 గంటలకు ప్రారంభించాలని సూచించారు. 11న నిర్వహించే ర్యాలీలో పాఠశాల మరియు కళాశాల విద్యార్థులు, అంగన్ వాడి కార్యకర్తలు, ఉద్యోగులను, డప్పు కళాకారులు పాల్గొనేలా చూడాలని, పాఠశాలల విద్యార్థులు స్వాతంత్య సమయయోదుల వేషదారణలో కొంతమంది వచ్చేలా చూడాలని అన్నారు. 16 మరియు 17వ తేదిలలో మండల స్థాయిలో కబడ్డి, ఖోఖో, వాలిబాల్, అథ్లెటిక్ వంటి మొదలగు ఆటల పోటీలను నిర్వహించి, గెలుపొందిన వారికి 18వ తేదిన బహుమతులను ప్రదానం చేయడం జరుగుతుందని పేర్కోన్నారు. చోప్పదండి, మానకొండూర్, హుజురాబాద్ నియోజక వర్గాలలో 14వ తేదిన జానపద కళాకారులతో కార్యక్రమాలను నిర్వహించెలా చూడాలని పేర్కోన్నారు.

     ఈ కార్యక్రమంలో పిడి మెప్మా రవీందర్, జిల్లా క్రీడల అభివృద్ది అధికారి రాజవీర్, బిసీ వెల్ఫేర్ అధికారి రాజమనోహర్, ఎస్సి వెల్పేర్ అధికారి నేతినియాల్, డిఐఓ రాజలక్ష్మీ,జిల్లా సంక్షేమ అధికారి పద్మావతి, జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి శ్రీలత, జిల్లా నెహ్రూ కేంద్ర కోఆర్డినేటర్ రాంబాబు, జిల్లా మైనారిటీ సంక్షేమ అధికారి మధుసూదన్ రావు మున్సిపల్ డిప్యూటీ కమిషనర్ త్రియంబకేశ్వర్ రావు, టిఎన్జిఓ జిల్లా ప్రెసిడెంట్ మారం జగదీశ్వర్, సెక్రటరి దారం శ్రీనివాస్ రెడ్డి, జిల్లా ఓలంపిక్ అసోసియోషన్ సభ్యులు కసిరెడ్డి జనార్దన్ రెడ్డి, పెట అసోసియోషన్ శ్రీనివాస్, నేషనల్ యూత్ అవార్డి కలింగ శేఖర్, స్టేట్ యూత్ అవార్డి శ్రీనివాస్, ఎస్.జి.ఎఫ్ సెక్రటరి సమ్మయ్య, సూపర్డెంట్ జయంత్, పాల్గోన్నారు.

Share This Post