పత్రికా ప్రకటన. తేది.11.08.2022, వనపర్తి.
75 వసంతాల భారత స్వాతంత్ర్య వజ్రోత్సవ వేడుకలలో భాగంగా “ఫ్రీడం రన్” కార్యక్రమాన్ని నిర్వహించినట్లు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి సూచించారు.
గురువారం వనపర్తి ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల నుండి ఎకో పార్క్ వరకు నిర్వహించిన “ఫ్రీడమ్ రన్” కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ భాష, జడ్పీ చైర్మన్ లోక్ నాథ్ రెడ్డితో కలిసి మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సి.ఎం. కె.సి.ఆర్. 15 రోజుల స్వతంత్ర భారత వజ్రోత్సవాల వేడుకలను, వివిధ కార్యక్రమాలను పెద్ద ఎత్తున చేపడుతున్నట్లు ఆయన తెలిపారు. ఈ నెల 8వ. తేది నుండి 22వ తేది వరకు కార్యక్రమాలను విజయవంతం చేయాలని ఆయన సూచించారు.
జిల్లా కలక్టర్ షేక్ యాస్మీన్ భాష మాట్లాడుతూ “ఫ్రీడమ్ రన్” కార్యక్రమం జిల్లాలో 5 మున్సిపాలిటీలు, 9 మండలాలు, సుమారు 20 వేల మంది విద్యార్థులు, అధికారులు, ప్రజా ప్రతినిధులు పాల్గొనటం జరిగిందని ఆమె సూచించారు. 13వ తేదీన విద్యార్థులు, యువకులు, సామాజిక వర్గాలతో వజ్రోత్సవ ర్యాలీ ఉంటుందని, 14వ తేదీన సాంస్కృతిక, జానపద కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని, 15వ తేదీన స్వాతంత్ర దినోత్సవ వేడుకలు, ఇంటింటా జెండా ఆవిష్కరణ నిర్వహించాలని, 16వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా సామూహిక గీతాలాపన నిర్వహించడం జరుగుతుందని ఆమె తెలిపారు. “ఫ్రీడం రన్” కార్యక్రమంలో పాల్గొన్న వారందరికీ ఆమె కృతజ్ఞతలు తెలిపారు.
అంతకుముందు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డికి, బాలభవన్ విద్యార్థులు రాఖీలు కట్టి, రక్షా బంధన్ కార్యక్రమం నిర్వహించారు. మంత్రి వారందరికీ రక్షాభందన్ శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ చైర్మన్ ఆర్ లోకనాథ్ రెడ్డి, జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ భాష, జిల్లా అదనపు కలెక్టర్ (లోకల్ బాడీ) ఆశిష్ సాంగ్వా.
సంగ్వన్ , (రెవెన్యూ) డి. వేణుగోపాల్, మున్సిపల్ చైర్మన్ గట్టు యాదవ్, వైస్ చైర్మన్ వాకిటి శ్రీధర్, మున్సిపల్ కమిషనర్ విక్రమ్ సింహారెడ్డి, డి ఆర్ డి ఓ, డి పి ఓ, జిల్లా అధికారులు, విద్యార్థులు, ప్రజా ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.
…….
జిల్లా పౌరసంబంధాల అధికారి, వనపర్తి ద్వారా జారీ చేయబడినది.