ఫ్రైడే డ్రై డే కార్యక్రమాలను విస్తృతంగా చేపట్టాలి…జిల్లా కలెక్టర్ అభిలాషా అభినవ్

ప్రచురణార్థం

ఫ్రైడే డ్రై డే కార్యక్రమాలను విస్తృతంగా చేపట్టాలి…

మహబూబాబాద్ ఆగస్టు 24.

ఫ్రైడే డ్రై డే కార్యక్రమాలను విస్తృతంగా చేపట్టాలని జిల్లా కలెక్టర్ అభిలాషా అభినవ్ ఆదేశించారు.

మంగళవారం కలెక్టర్ కార్యాలయంలో పలు అభివృద్ధి పనులపై మండల స్థాయి అధికారులతో కలెక్టర్ సమీక్షించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మలేరియా కేసులు 19 నమోదవగా డెంగ్యూ కేసులు 17 కు చేరుకున్నాయన్నారు.

మండల ప్రత్యేక అధికారులు నిల్వ ఉన్న నీటి పై ప్రజలకు అవగాహన పరిచి తొలగింప చేయాలన్నారు పారిశుధ్యం మెరుగు కు ప్రాధాన్యత ఇవ్వాలన్నారు గంగారం మండలం లో మలేరియా కేసులు ఎక్కువగా ఉన్నందున దోమ తెరల వినియోగంపై దృష్టి పెట్టాలన్నారు .గంబుషియా చేప పిల్లలను నిల్వ ఉన్న నీటిలో విడిచిపెట్టాలని అదేవిధంగా మురుగు నీటి నిల్వ లో ఆయిల్ బాల్స్ విడిచిపెట్టాలని అన్నారు కోవిద్ కేసులు తగ్గుముఖం పట్టిన యాక్టివ్ కేసులపై అజాగ్రత్త తగదన్నారు.

సెప్టెంబర్ ఒకటో తేదీ నుండి విద్యాసంస్థల అన్నింటిని ప్రారంభించనున్న ముందస్తు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సూచించారు పాఠశాలల్లో చెత్తాచెదారం తొలగింప చేయాలని పరిశుభ్రంగా ఉంచాలని మరుగుదొడ్లు వినియోగంలోకి తీసుకురావాలని ప్రతి పాఠశాలకు మిషన్ భగీరథ కనెక్షన్ తో నీటి సరఫరా అయ్యే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు పాఠశాలల ప్రారంభం రోజు పండుగ వాతావరణం కల్పించాలన్నారు పాఠశాల బోర్డులు ఆకర్షణీయంగా తీర్చిదిద్దాలన్నారు అదేవిధంగా గదులు గాలి వెలుతురు ఉండే విధంగా సందర్శించి పరిశీలించాలని అన్నారు రెసిడెన్షియల్ పాఠశాలలో విద్యార్థులు రాత్రివేళల్లో చదువుకునేందుకు వసతుల కల్పన పరిశీలించాలన్నారు వెలుతురు ఎక్కువగా ఉండేవిధంగా లైట్స్ అదనంగా ఏర్పాటు చేయాలన్నారు.
బృహత్ పల్లె ప్రకృతి వనాలపై సమీక్షిస్తూ స్వాధీనం చేసుకున్న ప్రభుత్వ స్థలాల లో ఏర్పాటుకు తక్షణం చర్యలు తీసుకోవాలన్నారు ప్రతిరోజు హరితహారం పై ప్రగతి సాధింపు ను నివేదికలు రూపొందించి అందజేయాలన్నారు. 933 రైతు కళ్ళాలను నిర్మించడం జరిగిందని పూర్తయిన వారికి చెల్లింపులు జరపాలన్నారు గ్రామాలలో అవసరమైన చోట కమ్యూనిటీ మంజూరు చేయుటకు అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు అదేవిధంగా పనులు చేసిన వారికి పేమెంట్ చెల్లించే విధంగా చర్యలు తీసుకుంటేనే రోజువారి కూలి పనుల పై ఆసక్తి చూపుతారని అధికారులు ఆ దిశగా ఆలోచన చేయాలన్నారు అక్రమ లే అవుట్ ల పై మాట్లాడుతూ అధికారులు చర్యలు తీసుకోవాలని జాప్యం చేయరాదన్నారు.

ఈ మండల స్థాయి వీడియో కాన్ఫరెన్స్లో జడ్పీ సీఈఓ రమాదేవి డిఆర్డిఎ ప్రాజెక్టు డైరెక్టర్ సన్యాసయ్య, వైద్యాధికారి హరీష్ రాజు పంచాయతీ అధికారి రఘువరన్ తదితరులు పాల్గొన్నారు.
——————————–
జిల్లా పౌరసంబంధాల అధికారి కార్యాలయం మహబూబాబాద్ వారిచే జారీ చేయడమైనది

Share This Post