బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వల్ల రాబోయే రెండు రోజులు రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయని, ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాల్లో అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నందున జిల్లా యంత్రాంగం అన్ని ముందస్తు చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ కలెక్టర్లను అప్రమత్తం చేశారు.

పత్రిక ప్రకటన

తేది: 30-8-2021

నారాయణపేట జిల్లా

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వల్ల రాబోయే  రెండు రోజులు రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయని, ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాల్లో అతి  భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నందున జిల్లా యంత్రాంగం అన్ని ముందస్తు చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ కలెక్టర్లను అప్రమత్తం చేశారు.  సోమవారం మధ్యాహ్నం హైద్రాబాద్ నుండి డిజిపి మహేందర్ రెడ్డి,  సంబంధిత శాఖల ముఖ్య కార్యదర్శులతో కలిసి అందరూ జిలా కలెక్టర్లతో సమీక్ష సమావేశం నిర్వహించారు.  ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ రాబోయే భారీ వర్షాలను దృష్టిలో ఉంచుకుని ఎలాంటి ప్రాణ హాని, ఆస్తి నష్టం జరగకుండా అన్ని ముందస్తు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పోలీస్ శాఖ, ఇరిగేషన్, రెవెన్యూ, వ్యవసాయ శాఖలతో సమన్వయం చేసుకొని  లోతట్టు ప్రాంతాలు, వాగులు, బ్రిడ్జ్ లు, బలహీనంగా ఉన్న చెరువులను గుర్తించి తగు ముందస్తు చర్యలు తీసుకోవాలని సూచించారు.

కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ డి.హరిచందన మాట్లాడుతూ జిల్లాలో ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా ప్రత్యేక అధికారులను అప్రమత్తం చేయడం జరుగుతుందన్నారు.  మత్స్యకారులు వేటకు వెళ్లకుండా చూడాలని, పొంగి ఊర్లుతున్న వగులను ప్రజలు, వాహన దారులు దాటకుండా చూడాలని, అవసరమైతే అలాంటి వాటిని గుర్తించి  అటు వైపు వెళ్లకుండా రోడ్డు మళ్లించాలని పోలీస్ శాఖను సూచించారు.   గ్రామాల్లో రెవెన్యూ సిబ్బంది, పంచాయతి సెక్రెటరీలు, మండల అధికారులు అప్రమత్తంగా ఉంటూ పరిస్థితులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ప్రజలను అప్రమత్తం చేయాలని ఇందుకు తగు ఆదేశాలు జారీ చేయాల్సిందిగా ఆదనవు కలెక్టర్ ను సూచించారు.

ఈ వీడియో కాన్ఫెరెన్సు లో ఎస్పీ డా. చేతన, ఆదనవు కలెక్టర్ కె. చంద్రా రెడ్డి తదితరులు పాల్గోన్నారు.

———————–

జిల్లా పౌర సంబంధాల అధికారి, నారాయణపేట జిల్లా ద్వారా జారీ.

Share This Post