సోమవారం వర్షాలు వల్ల తీసుకోవాల్సిన జాగ్రత్తలు, పొంగి పొర్లే వాగులు దాటకుండా భారీ కేండింగ్ ఏర్పాటు, చెరువులు సంరక్షణ చర్యలు, సహాయత కొరకు కంట్రోల్ రూములు ఏర్పాటు తదితర అంశాలపై కలెక్టరేట్ సమావేశపు హాలు నందు అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అత్యవసర సేవలకు ఏర్పాటు చేసిన కంట్రోల్ రూముకు ప్రజలు ఏ సమయంలో నైనా ఫోన్ చేయాలని చెప్పారు. కంట్రోల్ రూము నందు సిబ్బంది 24 గంటలు అంఫుబాటులో ఉంటారని చెప్పారు. వర్ష సూచన ఉన్న నేపథ్యంలో ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ అనుదీప్ తెలిపారు. కలెక్టరేట్ నందు 08744-241950, భద్రాచలం సబ్ కలెక్టర్ కార్యాలయం నందు 08743-232444 తో పాటు ఫోటోలు, వీడియోలు పంపుటకు ప్రత్యేకంగా 9392919743
వాట్సప్ చేయాలని ఆయన చెప్పారు. జాలర్లు చేపల వేటకు వెళ్ళొద్దని, వాగులు వంకలు పొంగి పొర్లే ప్రాంతాలల్లో రైతులు పొలం పనులకు వెళ్ళొద్దని, పశువులను ఇంటి పట్టునే ఉంచాలని, ఈ సమయంలో ప్రజలు ఇంటి పట్టునే ఉండాలని, ప్రయాణాలు సైతం మానుకోవాలని చెప్పారు.