బండ్లగూడా జాగీర్ మునిసిపల్ కార్పొరేషన్ పరిధిలో పట్టణ క్రీడా ప్రాంగణం కొరకు సేకరించిన స్థలమును పరిశీలించిన జిల్లా కలెక్టర్ ఆమోయ్ కుమార్

శనివారం 4వ విడుత పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా రంగారెడ్డి జిల్లా బండ్లగూడా జాగీర్ మునిసిపల్ కార్పొరేషన్ను సందర్శించి పట్టణ క్రీడా ప్రాంగణం కొరకు సేకరించిన స్థలమును జిల్లా కలెక్టర్ అమోయ్ కుమార్ పరిశీలించారు.

అనంతరం జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ 5వ విడుత పల్లె ప్రగతి / 4వ విడుత పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా క్రీడలకు ప్రాదాన్యం కల్పించే దిశగా ప్రభుత్వం ఒక ఎకరం స్థలంలో క్రీడా ప్రాంగణం ఏర్పాటు నేపథ్యంలో బండ్లగూడా జాగీర్ మునిసిపల్ కార్పొరేషన్ పరిధిలో పట్టణ క్రీడా ప్రాంగణం కొరకు సేకరించిన స్థలమును పరిశీలించడం జరిగింది. క్రీడా ప్రాంగాణాల ఏర్పాటు వలన పిల్లలకు, యువతకు మంచి భవిషత్ ఉంటుందని, క్రికెట్, ఖోఖో, వాలిబాల్, లాంగ్ జంప్, తదితర ఆటల వల్ల చాంపియన్ లను తయారు చేయవచ్చని అన్నారు. నేటి యువత మొబైల్ కి అలవాటు పడిపోయారని, దాని నుండి బయటకు రావడానికి క్రీడా ప్రాంగాణాలు ఎంతో ఉపాయోగపడతాయని తెలిపారు.

ఈ పర్యటనలో మునిసిపల్ కమీషనర్ వేణుగోపాల్ రెడ్డి, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

Share This Post