బడిబాట కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వర్తించి, ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్యను పెంచాలి – రాష్ట్ర విద్యా శాఖ మంత్రి పట్లోళ్ల సబిత ఇంద్రారెడ్డి

బడిబాట కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వర్తించి, ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్యను పెంచాలి – రాష్ట్ర విద్యా శాఖ మంత్రి పట్లోళ్ల సబిత ఇంద్రారెడ్డి

 

ప్రభుత్వ పాఠశాలలు సాధించిన ప్రగతి, ప్రభుత్వం కల్పిస్తున్న సదుపాయాలు, ఆంగ్ల బోధన మరియు గుణాత్మక విద్య బోధనాంశాలు వివరించి అధిక సంఖ్యలో విద్యార్థులను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాలేలా జూన్ 3వ తేదీ నుండి బడి బాట కార్యక్రమాన్ని నిర్వహించాలని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి పటోళ్ల సబితా ఇంద్రారెడ్డి విద్యా శాఖ అధికారులను ఆదేశించారు.

సోమవారం సాయంత్రం రాష్ట్ర విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణ, విద్యా శాఖ డైరెక్టర్ దేవసేన లతో కలిసి విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి హైదరాబాద్ నుండి జిల్లాల విద్యాశాఖ అధికారులు, మండలాల విద్యాశాఖ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ…..

జూన్ 13 నుండి పాఠశాలు  పున ప్రారంభం కానున్న సందర్భంగా జూన్ 13వ తేదీన విద్యార్థులకు పండుగ వాతావరణంలో ప్రజాప్రతినిధులు, అధికారులు ప్రభుత్వ పాఠశాలలకు వచ్చే విద్యార్థులకు  స్వాగతం పలికేలా పాఠశాలల్లో ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు.

అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్యను పెంచేందుకు జూన్  3వ తేదీ నుంచి జూన్ 10 తేదీ వరకు బడి బాట కార్యక్రమాన్ని విజయవంతంగా చేపట్టాలన్నారు.

బడిబాట కార్యక్రమంలో అన్నీ ప్రభుత్వ పాఠశాలలో కొనసాగించాలన్నారు. ప్రజలను, ప్రజాప్రతినిధులను, స్వచ్ఛంద సంస్థలు వివిధ వర్గాల ప్రజల భాగస్వామ్యంతో బడిబాట కార్యక్రమాన్ని నిర్వహించేందుకు జిల్లా యంత్రాగం చర్యలు చేపట్టాలని ఆదేశించారు.

పాఠశాలల ఉపాధ్యాయులను సంసిద్ధులను చేయడంతో పాటుగా బడిబయట పిల్లలను గుర్తించి, బడిఈడు పిల్లలను సర్కార్‌ బడుల్లో చేర్పించడమే లక్ష్యంగా ముందుకు సాగాలన్నారు.

రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు మన ఊరు మన బడి కార్యక్రమం ద్వారా పాఠశాలల ఆధునీకరణ తో పాటు ఆంగ్ల మాధ్యమాన్ని ప్రవేశపెట్టడం జరుగుతుందని, తల్లిదండ్రులకు వివరించి ప్రైవేట్ పాఠశాలలకు విద్యార్థులు వెళ్లకుండా చూడాలన్నారు.

ఫీజులతో కుటుంబ ఆర్థిక భారాలను తొలగించుకునే లా తల్లిదండ్రులకు అవగాహన కల్పించాలన్నారు.

నాగర్ కర్నూల్ నుండి వీడియో కాన్ఫరెన్స్ లో డీఈవో గోవిందరాజులు, సెక్టోరల్ అధికారులు బరపటి వెంకటయ్య, సతీష్ కుమార్, సూర్య చైతన్య లు, మండల విద్యాధికారులు రామారావు, భాస్కర్ రెడ్డి, బాసు నాయక్, శంకర్ నాయక్, చంద్రుడు, శ్రీనివాసులు,తదితరులు పాల్గొన్నారు.

Share This Post