బడి ఈడు పిల్లలు ఏ ఒక్కరు జిల్లాలో చదువుకు దూరంగా ఉండటానికి వీలు లేదని జిల్లా కలెక్టర్ డి. హరిచందన అన్నారు

బడి ఈడు పిల్లలు ఏ ఒక్కరు జిల్లాలో చదువుకు దూరంగా  ఉండటానికి వీలు లేదని జిల్లా కలెక్టర్ డి. హరిచందన అన్నారు. మంగళవారం  జిల్లాలోని  ఒంటరి మహిళల పిల్లలు 90 మందిని గురుకుల పాఠశాల లో చేర్పించిన సందర్బంగా స్థానిక గురుకుల పాఠశాలలో 90 మంది విద్యార్థులకు గురుకుల పాఠశాలలో స్థితిగతులు, సౌకర్యాల పై అవగాహన కల్పించారు.   ఈ సందర్బంగా ఒంటరి మహిళల పిల్లలను గుర్తించి వారి పిల్లలను గురుకుల పాఠశాలలో చదివించేందుకు సిద్ధం చేసి తీసుకువచ్చిన ఓ.యం.ఐ.ఎఫ్ స్వచ్చంద సంస్థ జిల్లా కోఆర్డినేటర్ లను, చైల్డ్ వెల్ఫేర్ కమిటీ చైర్మన్, జిల్లా సంక్షేమ అధికారిని అభినందించారు.  ఇంకా ఇలాంటి  ఎంత మంది పిల్లలు ఉన్నా తీసుకురావాలని అందరికి రాష్ట్రంలోని వివిధ గురుకుల పాఠశాలల్లో వారు చదువుతున్న తరగతుల్లో చేర్పించడం జరుగుతుందన్నారు. కొన్ని గురుకుల పాఠశాలల్లో క్రీడలు, పెయింటింగ్, ఓకేషనల్ వంటి సీట్లు ఉన్నాయని పిల్లలు అటువైపు ఆసక్తి ఉన్నట్లయితే అలాంటి వాటిలో సైతం చేర్పించేందుకు అవకాశం ఉందన్నారు.  బడి ఈడు పిల్లలు మాత్రం ఆర్థిక తదితర కారణాల వల్ల చదుకు దూరం కావడానికి వీలు లేదన్నారు.  గురుకుల పాఠశాల పిల్లలతో పాటు కొత్తగా వివిధ  గురుకులాల్లో చేరబోయే పిల్లలతో కలిసి కలెక్టర్ అక్కడే పిల్లలతో సహపంక్తి భోజనం చేస్తూ  పిల్లలతో ముచ్చటించారు.  గురుకుల పాఠశాలలో విద్యాభ్యాసం ఎలా ఉంటుంది, టీచర్లు ఎలా చూసుకుంటారు, మెనూ వారిగా మూడు పూటల భోజనం ఏమేమి ఇస్తారు అనే విషయాలు పిల్లలతో అడిగి తెలుసుకున్నారు.  అక్కడికి వచ్చిన పిల్లల్లో ఒకరిద్దరు అప్పటి వరకు తమ తల్లిదండ్రులను వదిలి వెళ్ళము అని అనుకున్న పిల్లలు గురుకుల పాఠశాల వాతావరణం, మంచి భోజనం చూసి తమ మనసు మార్చుకున్నామని ఖచ్చితంగా గురుకుల పాఠశాలలో చదువుకుంటామని కలెక్టరుకు మాట ఇచ్చారు.  గురుకుల పాఠశాలలో ఉపాధ్యాయులు, స్వచ్ఛంద సంస్థలో పని చేసే కోఆర్డినెటర్లు   అందరూ కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్నారా లేదా అని అడిగి తెలుసుకున్నారు.  పాఠశాలలో క్రమం తప్పకుండా వైద్య పరీక్షలు నిర్వహించాలని ఏ ఒక్క విద్యార్థికి కోవిడ్ సోకకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ప్రిన్సిపాల్ దేవసేన ను ఆదేశించారు.

జిల్లా సంక్షేమ అధికారి వేణుగోపాల్, ప్రిన్సిపాల్ దేవసేన, జిల్లా శిశు సంక్షేమ కమిటీ చైర్మన్ అశోక్,  ఓ.యం.ఐ.ఎఫ్ జిల్లా కోఆర్డినేటర్ హాజమ్మ, గురుకుల పాఠశాల ఉపాద్యాయులు, పిల్లలు తదితరులు పాల్గొన్నారు.

Share This Post