బడి ఈడు పిల్లలు రోడ్లపై కాకుండా వంద శాతం పాఠశాలల్లో ఉండేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ నిఖిల

బడి ఈడు పిల్లలు రోడ్లపై కాకుండా వంద శాతం పాఠశాలల్లో ఉండేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ నిఖిల అధికారులకు సూచించారు.

శనివారం కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట కార్యక్రమం పై సంబంధిత అధికారులతో జిల్లా కలెక్టర్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ బడి ఈడు పిల్లలందరూ తప్పనిసరిగా పాఠశాల చేర్పించేందుకు చర్యలు తీసుకోవాలని అన్నారు. జిల్లాలో 696 మంది పిల్లలను డ్రాప్ అవుట్ గా గుర్తించడం జరిగిందని వీరందరిని సంబంధిత శాఖల అధికారులు ప్రత్యేక చొరవ చూపి పాఠశాలలో చేర్చాలన్నారు. ప్రత్యేక డ్రైవ్ నిర్వహించి స్థానిక ప్రజా ప్రతినిధులు, తల్లిదండ్రులను భాగస్వాములను చేసి పిల్లలందర్నీ పాఠశాలో చేర్పించేందుకు కృషి చేయాలన్నారు. బడిఈడు పిల్లలను గుర్తించడంలో చైల్డ్ లైన్ ప్రతినిధులు, అంగన్వాడి సిబ్బంది సేవలను తీసుకోవాలని ఆమే అన్నారు. బడిబాట కార్యక్రమం పూర్తయ్యేలోపు జిల్లాలో ఎక్కడ కూడా బాల కార్మికులు లేకుండా చూడాలని కార్మిక శాఖ అసిస్టెంట్ కమిషనర్ కు సూచించారు. వసతి గృహాల్లో మెరుగైన సౌకర్యాల కల్పనకు , భవనాల మరమ్మతులకై అయ్యే ఖర్చు లకు సంబంధించి అంచనాలు సమర్పించాలని అధికారులకు సూచించారు.

ఈ సమావేశంలో జిల్లా ఇంచార్జ్ డిఆర్ఓ విజయకుమారి, జిల్లా విద్యాశాఖ అధికారి రేణుకా దేవి, జిల్లా గిరిజనాభివృద్ధి అధికారి కోటాజి, జిల్లా షెడ్యూల్ కులాల అభివృద్ధి అధికారి మల్లేశం, జిల్లా మైనార్టీ సంక్షేమాధికారి సుధారాణి, జిల్లా సంక్షేమ అధికారి లలిత కుమారి, జిల్లా వెనుకబడిన కులాల అభివృద్ధి అధికారి ఉపేందర్, కార్మిక శాఖ అసిస్టెంట్ కమిషనర్ శ్రీనివాస్, బాలల హక్కుల పరిరక్షణ వేదిక జిల్లా కన్వీనర్ శివరాజ్, చైల్డ్ లైన్ కోఆర్డినేటర్ శ్రీనివాస్, ప్రతినిధి వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు

Share This Post