బడి బాట కార్యక్రమాన్ని పకడ్బందీగా చేపట్టాలి – జిల్లా కలెక్టర్ కె.శశాంక.

బడి బాట కార్యక్రమాన్ని పకడ్బందీగా చేపట్టాలి – జిల్లా కలెక్టర్ కె.శశాంక.

ప్రచురణార్థం

బడి బాట కార్యక్రమాన్ని పకడ్బందీగా చేపట్టాలి – జిల్లా కలెక్టర్ కె.శశాంక.

మహబూబాబాద్, జూన్ -01:

బడి బాట కార్యక్రమాన్ని పకడ్బందీగా చేపట్టాలని జిల్లా కలెక్టర్ కె. శశాంక అధికారులను ఆదేశించారు.

బుధవారం కలెక్టరేట్ ప్రజ్ఞా సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ కె. శశాంక స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ అభిలాష అభినవ్ తో కలిసి ఈ నెల 3 నుండి 30 వరకు నిర్వహించు ప్రొ. జయశంకర్ బడి బాట కార్యక్రమానికి సంబంధించి కార్యాచరణపై సంభందిత అధికారులతో సమీక్షించారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ,
బడి బాట కార్యక్రమంలో అధికారులు జిల్లాలోని ప్రతి గ్రామ పంచాయతీ సర్పంచుల, పంచాయతీ సెక్రటరీ, ఎస్ ఎం సీ గ్రూపు సభ్యుల, ఛైర్మెన్, గ్రామ యువజన సంఘాల సహకారం తీసుకొని 6 సంవత్సరాల నుండి 14 సంవత్సరాల వయసు కలిగిన విద్యార్థినీ, విద్యార్థులు ఎక్కడ చదువుతున్నారో ప్రతి ఒక్కరి హాజరును ప్రైమరీ, హై స్కూల్ పాఠశాల విద్యార్థుల హాజరు పట్టికను ప్రదానోపాధ్యాయుడు నమోదు చేసే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు.

పాఠశాలకు వెళ్ళే వయస్సు ఉండి బడి బయట ఉంటే వారిని గుర్తించి పాఠశాలలో చేర్పించాలని తెలిపారు. ఐదేళ్ల వయస్సు లోపు పిల్లలు అంగన్వాడి లో ఉండాలని, ఆరు సంవత్సరాల వయస్సు నుండి పిల్లలు పాఠశాలలో ఉండాలని, పాఠశాలలో చదువుతున్న పిల్లలు మధ్యలో బడి మానివేసిన వారిపై దృష్టి సారించాలని, విద్యార్థి స్కూల్స్ మారిన సందర్భంలో వారి సంఖ్య మారుతుందని దానిని పరిశీలించాలని, అందులో ముఖ్యంగా ఆడపిల్లలు ఎక్కువగా ఉన్నారని, అందుకు సంబంధించిన కారణాన్ని తెలుసుకొని పరిష్కరించి వారి యొక్క హాజరు శాతం పెంచేందుకు కృషి చేయాలన్నారు. గ్రామంలోని పాఠశాలల్లో నమోదు కాబడిన విద్యార్థులు తరువాతి సంవత్సరం ఎక్కడికి వెళ్లి జాయిన్ అవుతున్నారో దృష్టి సారించాలన్నారు. అలాగే అంగన్వాడీల్లో చదువుతున్న పిల్లలు తరువాతి సంవత్సరం ఎక్కడ చదువుతున్నారో తెలుసుకోవాలన్నారు. 5వ, 7వ తరగతి పూర్తి చేసుకొన్న తర్వాత తదుపరి తరగతుల్లో చేరే విద్యార్థులు డ్రాప్ అవుట్ కాకుండా చూడాలని, అలాగే ప్రైవేటు పాఠశాలలో చేరకుండా చర్యలు తీసుకోవాలన్నారు.

ఈ కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ అభిలాష అభినవ్, జిల్లా విద్యాశాఖ అధికారి ఎం.డి. అబ్దుల్ హై, జిల్లా పరిషత్ సీఈవో రమాదేవి, డి పి ఓ సాయి బాబా, DWO స్వర్ణలత లెనిన, సంక్షేమ అధికారులు, ఎం ఈ ఓ లు, సెక్టార్ అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

Share This Post