బడుగు, బలహీన వర్గాలకు ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ స్ఫూర్తి ప్రధాత – జిల్లా కలెక్టర్ డి హరిచందన

బడుగు, బలహీన వర్గాలకు ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ స్ఫూర్తి ప్రధాత – జిల్లా కలెక్టర్ డి హరిచందన

యువత కొండా లక్ష్మణ్ బాపూజీని ఆదర్శంగా తీసుకుని ఉన్నత స్థానాలకు ఎదగాలని జిల్లా  కలెక్టర్ డి హరిచందన్  అన్నారు. సోమవారం ఉదయం కలెక్టరేట్లో కొండా లక్ష్మణ్ బాపూజీ 106వ జయంతి సందర్బంగా  కొండ లక్ష్మణ్ బాపూజీ చిత్ర పటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు.   తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలకంగా పాల్గొని దిశా నిర్దేశం చేసిన వ్యక్తి బాపూజీ అని తెలిపారు.  యువత ఆయనను ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు.

బడుగు, బలహీన వర్గాలకు కొండా లక్ష్మణ్‌ బాపూజీ స్ఫూర్తి ప్రధాత, గొప్ప ప్రజాస్వామిక వాది  సాయుధ పోరాట కాలంలో న్యాయవాదిగా సేవలందించి, ఉద్యమకారుల తరఫున న్యాయపోరాటం చేసిన ప్రజాస్వామిక వాదిఅని, మహాత్మా గాంధీ అందించిన స్ఫూర్తితో భారతదేశ స్వాతంత్య్రోద్యమంలో సైతం  పాల్గొన్నారన్నారు.

ఈ కార్యక్రమంలో కృష్ణమ చారి  BC వెల్ఫేర్ అధికారి జిల్లా అధికారులు ల్యఖత్ అలీ, రామ సుబ్బా రావు, కన్య కుమారి తహసిల్దార్  నాగలక్ష్మి  కలెక్టర్ కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Share This Post