బడుగు, బలహీన వర్గాలకు ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ స్ఫూర్తి ప్రధాత – అదనపు కలెక్టర్ మను చౌదరి

యువత కొండా లక్ష్మణ్​ బాపూజీని ఆదర్శంగా తీసుకుని ఉన్నత స్థానాలకు ఎదగాలని అదనపు కలెక్టర్​ మను చౌదరి అన్నారు. సోమవారం ఉదయం కలెక్టరేట్​లో కొండా లక్ష్మణ్ బాపూజీ 106వ జయంతి సందర్బంగా అదనపు కలెక్టర్ పి. శ్రీనివాస్ రెడ్డి తో కలసి కొండ లక్ష్మణ్ బాపూజీ చిత్ర పటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలకంగా పాల్గొని దిశా నిర్దేశం చేసిన వ్యక్తి బాపూజీ అని తెలిపారు. యువత ఆయనను ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు.
బడుగు, బలహీన వర్గాలకు కొండా లక్ష్మణ్‌ బాపూజీ స్ఫూర్తి ప్రధాత, గొప్ప ప్రజాస్వామిక వాది సాయుధ పోరాట కాలంలో న్యాయవాదిగా సేవలందించి, ఉద్యమకారుల తరఫున న్యాయపోరాటం చేసిన ప్రజాస్వామిక వాదిఅని, మహాత్మా గాంధీ అందించిన స్ఫూర్తితో భారతదేశ స్వాతంత్య్రోద్యమంలో సైతం పాల్గొన్నారన్నారు.
ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డి, జిల్లా అధికారులు అనిల్ ప్రకాష్, నర్సింగ్ రావు, భూపాల్ రెడ్డి, సీతారాం, శ్రీధరరావు, జడ్పీ డిప్యూటీ సీఈఓ భాగ్యలక్ష్మి, ఎ బీ సి శ్రీధర్ జీ, పద్మశాలి కులస్తులు బాస వెంకటేష్, గజ్జరి నిరంజన్, కుకుడాలా వెంకటస్వామి, మ్యాడారపు గంగాధర్, రామకృష్ణ, రామచంద్రయ్య, కలెక్టర్ కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Share This Post