బతుకమ్మను గౌరవించినట్లు ఆడపిల్లలను కూడా గౌరవించాలి…..

ప్రచురణార్థం

జిల్లా సిడబ్ల్యుసి చైర్ పర్సన్ డాక్టర్ నాగవాణి గారి ఆధ్వర్యంలో బతుకమ్మను గౌరవించినట్లు గానే ఆడపిల్లలను కూడా గౌరవించాలి అనే అవగాహన కొరకై తయారు చేసిన గోడ పత్రికలను జిల్లా కలెక్టర్ శశాంక్ సోమవారం విడుదల చేసారు. వారు మాట్లాడుతూ నేటి పరిస్థితుల ప్రభావం వల్ల ఆడపిల్లలు చాలా అవమానాలను , సమస్యలను ఎదుర్కొంటున్నారు, ఇలాంటి పరిస్థితుల్లో బతుకమ్మను ఏవిధంగానైతే మనం బతికించు కుంటున్నామో అదే విధానం ఆడపిల్లల్ని కూడా పుట్టనిద్దాం,బ్రతకనిద్దాం,చదవనిద్దాం,ఎదగనిద్దాం , మంచి భవితనిద్దాం,రేపటి సమాజానికి ఒక తల్లిని,చెల్లిని, స్నేహితురాలిని, అందిద్దాం ఆడపిల్లలపై అఘాయిత్యాలు జరగకుండా ప్రతి ఒక్కరం అడ్డుకుందాం అని పిలుపు నిచ్చారు.

ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ అబిలాష అబినవ్ గారు , అడిషనల్ కలెక్టర్ కొమురయ్య గారు , ట్రైనీ కలెక్టర్ , జిల్లా సంక్షేమ అధికారి స్వర్ణలతా లెనీనా గారు, సిడబ్ల్యుసి మెంబర్ డాక్టర్ డేవిడ్ గారు , బిఆర్బి కో ఆర్డినేటర్ జ్యోతి , డిసిపివో కమలాకర్, చైల్డ్ లైన్ కో ఆర్డినేటర్ వెంకటేష్ మరియు జిల్లా అదికారులు అందరూ పాల్గొన్నారు…
—————————————————————-

Share This Post