బతుకమ్మ ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు అవపరమైన అన్ని ఏర్పాట్లు చేయాలనీ హనుమకొండ కలక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు అధికారులను ఆదేశించారు.

శుక్రవారం నాడు హనుమకొండ కలక్టరేట్ సమావేశ మందిరం లో హనుమకొండ, కలక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు వరంగల్ కలక్టర్ గోపి లతో కలిసి, బతుకమ్మ ,దసరా ఉత్సవాల ఫై సమీక్షా సమావేశం నిర్వహించారు .

ఈ సందర్బంగా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బతుకమ్మను రాష్ట్ర పండుగగా గుర్తించిన నేపథ్యంలో పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలన్నారు.ఈనెల అరవ తేది నుండి పదిహేనవ తేది వరకు బతుకమ్మ పండుగ ఉత్సవాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
ఈ ఉత్సవాల్లో కరోన నిభాదనలను ప్రతి ఒక్కరు పాటించాలని ,విధిగా మాస్క్ ధరిoచాలని ఆయన అన్నారు. మహిళలు బతుకమ్మ ఉత్సవాల్లో పెద్ద సంఖ్యలో పాల్గొనేలా చూడాలని అన్నారు. అధికారులు మైదానాలను అందంగా తీర్చిదిద్దటంతో పాటు, మహి ళలు బతుకమ్మను ఆడుకునేందుకు వీలుగా సర్కిళ్లు ఏర్పాటు చేయూలని ఆదేశించారు. బతుకమ్మలను నిమజ్జనం చేసేందుకు చెరువులు, కుంటలను పరిశుభ్రంగా ఉంచాలని సూచించారు. దీంతోపాటు ప్రధాన కూడళ్లను విద్యుద్దీపాలతో అలంకరించాలని, విద్యుత్ సమస్య లేకుండా చర్యలు తీసుకోవాలన్నారు. బతుకమ్మ నిర్వహించే మైదానల్లో లైటింగ్, జనరేటర్లను ముందస్తుగా ఏర్పాటు చేసుకోవాలన్నారు. పట్టణం, గ్రామీణప్రాంతాల్లోని చౌరస్తాలను అందంగా అలంకరించి పండుగ వాతావరణాన్ని తలపించేలా చూడాలన్నారు. ఉత్సవాల్లో కళాజాత బృందాల ద్వారా సంస్కృతి, సాంప్రదాయాలని ప్రజలకు వివరించేలా చూడాలన్నారు. చెరువుల వద్ద మహిళలకు ఎటువంటి ఇబ్బంది కలుగకుండా గజ ఈతగాళ్లను అందుబాటులో ఉంచుకోవాలని , బతుకమ్మ ఆడుకునే ఆడపడుచులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా తగు ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. బతుకమ్మ ఆడు ప్రదేశంలో సరైన వెలుతురు, పీఏ సిస్టం ఏర్పాటు చేయాలని తెలిపారు. విద్యుత్ నిరంతరాయంగా సరఫరా అయ్యే విధంగా, మంచినీటి సౌకర్యం, అగ్నిమాపక యంత్రాలు, మెడికల్ సౌలభ్యం అందుబాటులో ఉంచాలన్నారు.

వరంగల్ కలక్టర్ గోపి మాట్లాడుతూ బతుకమ్మ దసరా ఉత్సవాలను విజయవంతం చేయడానికి అధికారులు సమన్వయం తో పని చేయాలనీ అన్నారు.

మున్సిపల్ కమిషనర్ ప్రావిణ్య మాట్లాడుతూ శానీ టేషన్ ను సమర్ధవంతగా చేపట్టాలని తెలిపారు.ఎల్ఈడి స్క్రీన్ లను ఏర్పాట్లు చేయాలనీ తెలిపారు.చిన్నారులు, మహిళల రక్షణ కు ప్రత్యేక శ్రద్ధ వహించాలని అధికారులను ఆదేశించారు.

ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ సంధ్యారాణి, డీసీపీ పుష్ప, డి ఆర్ ఓ వాసుచంద్ర, హనుమకొండ, వరంగల్ జిల్లాల ఉన్నత అధికారులు, ఆలయ అర్చకులు, తదితరులు పాల్గొన్నారు.

Share This Post