*బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమం విజయవంతం చేయాలి*

వార్త ప్రచురణ
తేదీ.02.09.2021.
ములుగు జిల్లా.

జిల్లా కలెక్టర్ కాన్ఫరెన్స్ హాలు బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమం అట్టహాసంగా ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ ఎస్.కృష్ణ ఆదిత్య ఆదేశాల మేరకు డియర్డివో మరియు ఇంచార్జీ అదనపు కలెక్టర్ ( లోకల్ బాడీ) నాగ పద్మజ , డియర్వో కె. రమాదేవి అధ్వర్యంలో బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా పరిషత్ వైయస్ ఛైర్మెన్ బడే నాగ జ్యోతి పాల్గొని లబ్ధిదారులకు బతుకమ్మ చీరలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ మాట్లాడుతూ బతుకమ్మ పండగ సందర్భంగా ఆడబిడ్డలకు అతి పెద్ద పండగకి పెద్ద అన్న గా మన ముఖ్య మంత్రి కేసీఆర్ గారు “నేను ఉన్నాను” అనే బరోసా కల్పిస్తూ బతుకమ్మ చీరలను పంపించారని వారు అన్నారు. మొట్టమొదటగా బతుకమ్మ చీరలను గిరిజనులు ఆరాధ్య దైవం అయిన మేడారం సమ్మక్క సారలమ్మ సన్నిధి లో భక్తి శ్రద్ధలతో అమ్మవార్లకు బతుకమ్మ చీరలను సమర్పించి వారి ఆశీర్వాదం తో మొట్టమొదటగా జిల్లా కేంద్రంలో పంపిణీ చేయడం జరిగిందని వారు అన్నారు.

ఈ కార్యక్రమంలో ఆర్డీవో కె. రమాదేవి మాట్లాడుతూ మన జిల్లా కి లక్ష 20 వేల చీరలు జిల్లాకి పంపిణీ నిమిత్తం వచ్చాయని, జిల్లా కార్యాలయం లో శనివారం రోజున ప్రారంభించడం జరిగిందని, రేపటి నుండి మండలాల వారిగా బతుకమ్మ చీరలను పంపిణీ చేయడం జరుగుతుందని అన్నారు. గౌరవ ముఖ్య మంత్రి గారు జిల్లా లోని ఆడబిడ్డల కోసం బతుకమ్మ చీరలను పంపించారని, ప్రతి ఒక్కరూ బతుకమ్మ చీరలను సంతోషం గా స్వీకరించి బతుకమ్మ పండగను ఘనంగా జరుపుకోవాలని అన్నారు.

ఈ సందర్భంగా ఎంపీపీ గండ్ర కోట శ్రీదేవి మాట్లాడుతూ అమ్మవార్ల ఆశీర్వాదంతో అడ బిడ్డలకు బతుకమ్మ చీరలు పంపిణీ చేయడం జరుగుతుందని వారు అన్నారు.

ఈ సందర్భంగా అత్మ ఛైర్మెన్ దుర్గం రమణయ్య మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమం విజయవంతం చేయాలని వారు అన్నారు.

ఈ కార్యక్రమంలో జిల్లా పంచాయితీ అధికారి వెంకయ్య,డిపియర్వో ప్రేమ లత
డిడబ్ల్యుఓ ప్రేమలత, తహశీల్దార్ సత్య నారాయణస్వామి మరియు సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

Share This Post