బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమం సజావుగా జరగాలి…

ప్రచురణార్థం

బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమం సజావుగా జరగాలి…

మహబూబాబాద్ సెప్టెంబర్ 30.

ఈనెల ఆరో తేదీన బతుకమ్మ పండుగ పురస్కరించుకుని రాష్ట్ర వ్యాప్తంగా పంపిణీ చేసే బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమాన్ని జిల్లాలో సజావుగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ శశాంక ఆదేశించారు.

గురువారం కలెక్టర్ కార్యాలయంలో జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థ ప్రాజెక్ట్ డైరెక్టర్ ఆధ్వర్యంలో బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమం పై సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ అక్టోబర్ 2 గాంధీ జయంతిని పురస్కరించుకుని బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టనున్నారు.

బతుకమ్మ చీరలు జిల్లాకు చేరాయని 6 మండలాలకు కూడా పంపిణీ చేయడం జరిగిందన్నారు అక్టోబర్ ఒకటో తేదీ మధ్యాహ్నం లోగా మిగతా మండలాల్లో అన్నింటికి చేరవేయడం జరుగుతుందన్నారు.

జిల్లాకు రెండు లక్షల 71 వేల చీరలు లక్ష్యంగా పెట్టుకోగా ఒక లక్ష 95 వేల చీరలు సరఫరా జరిగినట్లు కలెక్టర్ వివరించారు కులమతాలకతీతంగా ప్రజాప్రతినిధుల సహకారం తీసుకోవాలని సూచించారు 18 సంవత్సరాలు నిండిన ప్రతి మహిళకు చీర అందజేసే విధంగా ప్రజాప్రతినిధుల సహకారం తీసుకోవాలని అర్బన్ రూరల్ బృందాలకు కలెక్టర్ ఆదేశాలు ఇచ్చారు.

చీరల పంపిణీ కార్యక్రమాన్ని రేషన్ షాపుల ద్వారా చేపట్టాలని చీర ని పొందే మహిళ రేషన్ కార్డు తో ఆధార్ కార్డు వెంట తెచ్చుకోవాలని కలెక్టర్ తెలియజేశారు.

చీరలు పంపిణీ చేసే ప్రదేశాన్ని చాటింపు చేయించాలనే అధికారులకు సూచించారు కోవిద్ నిబంధనలు పాటిస్తూ చీరల పంపిణీ కార్యక్రమాన్ని సజావుగా చేపట్టాలన్నారు.

ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ లు అభిలాష అభినవ్ కొమరయ్య శిక్షణ కలెక్టర్ అభి షేక్ అగస్త్య తొర్రూర్ ఆర్డిఓ రమేష్ డిఆర్డిఎ పిడి సన్యాసయ్య జిల్లా అధికారులు తాసిల్దార్ లు తదితరులు పాల్గొన్నారు
—————————————
జిల్లా పౌరసంబంధాల అధికారి కార్యాలయం మహబూబాబాద్ వారిచే జారీ చేయడమైనది

Share This Post