బతుకమ్మ చీరెలు పంపిణీ కార్యక్రమంలో ప్రొటోకాల్ సమస్య రాకుండా ప్రజా ప్రతినిధులను సమన్వయం చేసుకుంటూ కార్యక్రమాన్ని నిర్వహించాలని జిల్లా కలెక్టర్ అనుదీప్ తెలిపారు. జిల్లాలోని ఐదు నియోజకవర్గాలైన పినపాక, ఇల్లందు, భద్రాచలం, అశ్వారావుపేట, కొత్తగూడెంలతో పాటు వైరా నియోజకవర్గ పరిధిలోకి వచ్చే జూలూరుపాడు మండలాలకు చీరెలు పంపిణీ కార్యక్రామాన్ని చేపట్టేందుకు ప్రత్యేక అధికారులను నియమించినట్లు ఆయన చెప్పారు. భద్రాచలంకు ఐటిడిఏ పిఓ గౌతం, అశ్వారావుపేటకు అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు, ఇల్లందుకు జడ్పీ సిఈఓ విద్యాలత, కొత్తగూడెం నియోజకవర్గంతో పాటు వైరా నియోజకవర్గంలోని జూలూరుపాడు మండలానికి డిఆర్డిఓ మధుసూదన్ రాజు, పినపాక కు ఆర్డిఓ స్వర్ణలత ప్రత్యేక అధికారులుగా వ్యవహరిస్తారని చెప్పారు. నియోజకవర్గాల వారిగా పంపిణీ చేయనున్న చీరెల మొత్తం. అశ్వారావుపేటకు 57000, భద్రాచలంకు 39000, కొత్తగూడెంకు 78000, పినపాకకు 31000, వైరా నియోజకవర్గ పరిధిలోని జూలూరుపాడుకు 10000, ఇల్లందుకు 40000 మొత్తం 255000 చీరెలు పంపిణకి సిద్ధంగా ఉన్నట్లు ఆయన స్పష్టం చేశారు. అర్హులను ఎంపిక చేయుటకు గ్రామస్థాయిలో పంచాయతీ కార్యదర్శి/విఆర్ఓ, గ్రామసమాఖ్యలు, చౌక దుకాణ డీలర్, అంగన్వాడీ, ఐకేపీ సిసిలతోను, మండలస్థాయిలో తహసిల్దార్, యంపిడిఓ, యంఈఓ, ఐకేపి ఏపియంలతో కమిటీలు ఏర్పాటు చేసినట్లు ఆయన వివరించారు. కోవిడ్ ప్రొటోకాల్స్ పాటిస్తూ చీరెలు పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టాలని చెప్పారు. చీరెలు పంపిణీ కేంద్రాల వద్ద రద్దీ నియంత్రణ చర్యలు పాటించాలని చెప్పారు. నిరుపేద కుంటుంబాలకు చెందిన మహిళలు బతుకమ్మ పండుగను ఘనంగా జరుపుకోవాలనే ఉద్దేశ్యంతో బతుకమ్మ కానుకగా ప్రభుత్వం ఉచితంగా బతుకమ్మ చీరెలు పంపిణీ చేపట్టినట్లు ఆయన వివరించారు.
You Are Here:
Home
→ బతుకమ్మ చీరెలు పంపిణీ కార్యక్రమంలో ప్రొటోకాల్ సమస్య రాకుండా ప్రజా ప్రతినిధులను సమన్వయం చేసుకుంటూ కార్యక్రమాన్ని నిర్వహించాలని జిల్లా కలెక్టర్ అనుదీప్ తెలిపారు.
You might also like:
-
జిల్లాలో అక్రమ ఇసుక రవాణాను పూర్తిగా అరికట్టి ప్రభుత్వ ఆదాయాన్ని పెంచేందుకు పకడ్బందీ చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ ప్రియాంక అలా అధికారులను ఆదేశించారు.
-
ఈరోజు స్థానిక కొత్తగూడెం క్లబ్ నందు మహిళా శిశు సంక్షేమ శాఖ వారి ఆధ్వర్యంలో పోషణ మాస మహోత్సవాలు జరిగాయి ఇట్టి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ శ్రీమతి ప్రియాంక అలా ఐఏఎస్ గారు హాజరైనారు.
-
పంటరుణ మాఫీ, ఆయిల్ పామ్ సాంగు, ఎరువులు సరఫరాపై జిల్లా కలెక్టరు ప్రియాంక అలా సమీక్ష.
-
నాడు సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో సమస్త వ్యవసాయ విస్తరణ అధికారులు, మండల వ్యవసాయ అధికారులు, ఉద్యాన అధికారులు, సహాయ వ్యవసాయ సంచాలకులు, ఆయిల్ పామ్ కంపనీ ఫీల్డ్ అధికారులు, జిల్లా వ్యవసాయ అధికారి మరియు జిల్లా ఉద్యాన మరియు పట్టుపరిశ్రమ శాఖ అధికారి తదితరులతో ఈ ఆర్ధిక సంవత్సరములో వానాకాలం మరియు యాసంగీ కాలలకు కేటాయించిన 20500 ఎకరాలు లక్ష్యాన్ని క్లస్టర్ వారీగా సాదించాలని ఆదేశించారు