బతుకమ్మ చీరెలు పంపిణీ చేసిన అక్విటెన్సులు గురువారం వరకు డిఆర్డిఓ కార్యాలయానికి పంపించాలని జిల్లా కలెక్టర్ అనుదీప్ తహసిల్దారులను, మున్సిపల్ కమిషనర్లును ఆదేశించారు.

గురువారం కలెక్టరేట్ నుండి డిఆర్డిఓ, పంచాయతీ, రెవిన్యూ, యంపిడిఓలతో బతుకమ్మ చీరెలు పంపిణీ చేసిన అక్విటెన్సులు, బృహాత్ పకృతి వనాలు ఏర్పాటు, హరితహారం, మొక్కల సంరక్షణ, నర్సరీలు నిర్వహణ, ఇంకుడు గుంతలు నిర్మాణం, ఉపాధి హామి పథకం పనులపై వీడియో కాన్ఫరెన్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో 110 బృహత్ పకృతి వనాలు ఏర్పాటు లక్ష్యం కాగా ఇప్పటి వరకు 88 చోట్ల భూములు గుర్తించామని, 53 చోట్ల యంపిడిఓలకు భూములు అప్పగించామని, 35 చోట్ల తహసిల్దారులు యంపిడిఓలకు భూములు అప్పగించాల్సి ఉందని, 18 చోట్ల ఇంకనూ భూములు గుర్తించాల్సి ఉన్నట్లు చెప్పారు. భూమి అప్పగించిన ప్రతి స్థలంలో తప్పని సరిగా పనులు ప్రారంభించాలని అట్టి సైట్స్ను తాను తనిఖీ చేయనున్నట్లు యంపిడిఓటలకు సూచించారు. బృహత్ పల్లె పకృతి వనాల్లో మొక్కల రక్షణకు ఉపాధి హామి పథకంలో ప్రజలకు పనులు కల్పన చేయాలని, తద్వారా ప్రజలకు ఉపాధి లభిస్తుందని చెప్పారు.. చండ్రుగొండ మండలంలో బృహాత్ పల్లె పకృతి వనంలో వారం రోజుల్లో మొక్కలు నాటే విధంగా చర్యలు తీసుకోవాలని, లేకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని, డిఆర్డిఓ నిరంతర పర్యవేక్షణ చేయాలని చెప్పారు. బూర్గంపాడు, చంద్రుగొండ, దుమ్ముగూడెంలో పనులు ప్రారంభించకపోవడంపై తనకు ఎందుకు కథలు చెప్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. భూమి కేటాయించి రోజులైన ఎందుకు జాప్యం చేస్తున్నారని, సమగ్ర కార్యాచరణ ఎందుకు చేయలేదని అసహనం వ్యక్తం చేస్తూ వారం రోజుల్లో మొక్కలు నాటి నివేదిక అందచేయాలని, లేనట్లయితే యంపిడిఓను, కార్యదర్శిని, ఏపిఓను భాద్యులను చేసి కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. సీజన్లో నీళ్లు లేకపోతే మొక్కలు చనిపోతాయని, ఇన్ని లక్షలు పెట్టి మొక్కలు నాటినా సంరక్షణ చేయకపోతే ఎలా అని తక్షణం మోటార్లు ఏర్పాటు చేయాలని యంపిడిఓలను ఆదేశించారు. బృహాత్ పకృతి వనాల్లో మొక్కల సంరక్షణకు విద్యుత్, స్ప్రింకర్లు ఏర్పాటు ప్రక్రియను వారం రోజుల్లో పూర్తి చేసి నివేదికలు అందచేయాలని చెప్పారు. ట్రీ గార్డులు విరిగిపోయి పక్కకు పడిపోయి ఉన్నాయని, అక్కడక్కడ సంరక్షణ లేకపోవడం వల్ల మొక్కలు నిర్జీవంగా మోడు వారి కనిపిస్తున్నాయని, యుద్ధ ప్రాతిపదికన మొక్కల సంరక్షణ చర్యలు చేపట్టాలని చెప్పారు. ప్రధాన రహదారుల వెంబడి ప్లాంట్ కేర్ యాక్టివిటి అనుకున్న మేర జరగడం లేదని ప్రత్యేక అధికారులు రహదారుల వెంబడి వ్యర్థాలు తొలగింపు, మొక్కల సంరక్షణ చర్యలు చేపట్టు విధంగా చర్యలు తీసుకోవాలని రానున్న 15 రోజుల్లో మార్పు కనిపించాలని, చనిపోయిన మొక్కల స్థానంలో మొక్కలు నాటాలని చెప్పారు. అవెన్యూ ప్లాంటేషన్లో క్వాలిటి ఉండాలని నాగారం నుండి సారపాక వరకు గ్యాప్ లేకుండా వారం రోజుల్లో మొక్కలు నాటే ప్రక్రియను పూర్తి చేయాలని చెప్పారు. మీడియన్ ప్లాంటేషన్లో మల్టీపర్పన్ మొక్కలు నాటాలని చెప్పారు. మణుగూరు క్రాస్ రోడ్ నుండి జానంపేట వరకు అవెన్యూ ప్లాంటేషన్లో గ్యాప్స్ ఉన్నాయని, పరిశీలన చేసి గ్యాప్ లేకుండా మొక్కలు నాటడంతో పాటు రహదారులకు ఇరువైపులా ఉన్న పిచ్చి మొక్కలను తొలగించి పరిశుభ్రం చేయించాలని యంపిడిఓలకు సూచించారు. అవెన్యూ ప్లాంటేషన్ బాగా చేసిన సిబ్బందికి ప్రశంసా పత్రాలు జారీ చేయనున్నట్లు చెప్పారు. పల్లె పకృతివనాల్లో డెన్స్ ప్లాంటేషన్ చేయాలని చెప్పారు. డిసెంబర్ 10వ తేదీ వరకు నర్సరీల్లో బ్యాగ్ ఫిల్లింగ్ పూర్తి చేయాలని వేగం పెంచాలని చెప్పారు. ప్రతి శనివారం బ్యాగ్ ఫిలింగ్ చేసిన నిధులు చెల్లింపు చేయు విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పారు. గ్రామ అవసరాలను దృష్టిలో ఉంచుకుని ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికతో మొక్కలు పెంపకాన్ని చేపట్టాలని చెప్పారు. గ్రామాల అభివృద్ధికి పెద్ద ఎత్తున ఉపాధిహామి పథకం ద్వారా పనులు చేపట్టేందుకు లేబర్ మొబలైజేషన్ జరగాలని ప్రతి గ్రామ పంచాయతీలో లక్ష్యాన్ని కేటాయించుకోవాలని చెప్పారు.

 

ఈ వీడియో కాన్ఫరెన్సులో డిఆర్డీఓ మధుసూదన్ రాజు, డిపిఓ రమాకాంత్, సిఈఓ విద్యాలత, అన్ని మండలాల యంపిడిఓలు, యంపిఓలు, కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు.

 

Share This Post