బతుకమ్మ తో..సంస్కృతి సంప్రదాయాలకు పెద్ద పీఠ:: కలెక్టర్ గోపి

మంగళవారం వరంగల్ కలెక్టరేట్ లో ఘనంగా బతుకమ్మ వేడుక లు జరిగాయి .

జిల్లా కలెక్టర్ గోపి కుటుంబ సమేతం గా పాల్గొని ఈ వేడుకలను ప్రారంభించారు .

ముందు గా వివిధ రకాల పూల తో పేర్చిన బతుకమ్మ లకు సతి సమేతం గా కలెక్టర్ పూజ లు నిర్వహిం చి బతుకమ్మ ఆట లో పాల్గొన్నారు .

అనంతరం వివిధ శాఖ ల అధికారులు తెచ్చిన బతుకమ్మ లను అడిషినల్ కలెక్టర్ హరి సింగ్, TGO నాయకులతో కలిసి కలెక్టర్ వీక్షించారు .

ఆతర్వాత ఏర్పాటు చేసిన సమావేశం లో పాల్గొన్న కలెక్టర్ మాట్లాడుతూ ఈరోజు కార్యాలయం లో పండుగ వాతావరణం ఉందన్నారు.

రివ్యూ సమావేశాలతో ఎప్పుడు బిజీ బిజీ గా కనిపించే కలెక్టరేట్ కు … ఈరోజు బతుకమ్మ వేడుకలతో పండుగ కళ వచ్చిందన్నారు

తెలంగాణలో బతుకమ్మ పండుగ ద్వారా సంస్కృతి
సంప్రదాయలకు పెద్ద పీట వేస్తున్నామన్నారు .

బతుకమ్మ పండుగ వెనుక సైన్టిఫిక్ కారణం కూడా ఉందన్నారు .

తరువాత అడిషినల్ కలెక్టర్ హరి సింగ్ మాట్లాడుతూ పూల ను పూజించే గొప్ప సంస్కృతి మనది అని తెలిపారు.

ఉద్యోగులందరూ ఎంతో సంతోషంగా ఈ వేడుకల లో పాల్గొన్నందుకు ధన్యవాదములు అని అన్నారు.

ఈ వేడుకలను విజయవంతం చేసిన tgo, tngo, రెవెన్యూ ఉద్యోగుల అసోసియేషన్ సంఘాలకు కృతజ్ఞతలు తెలిపారు.

ఎంతో చక్కగా బతుకమ్మ లను పేర్చి తీసుకొచ్చిన వివిధ శాఖల వారికి మొదటి, రెండవ, మూడవ బహుమతులను కలెక్టర్ చేతుల మీదుగా అందచేశారు .

ఇందులో భాగంగా మొదటి బహుమతి కలెక్టరేట్ స్టాఫ్ , icds స్టాఫ్ కు

రెండవ బహుమతి drdo,mgm వారికి

మూడవ బహుమతి dco, dmho శాఖకి లభించాయి

ఈ కార్యక్రమంలో rdo మహేందర్ జి, AO రాజేంద్రనాథ్, అన్నీ శాఖ లకు సంబందించిన జిల్లా స్థాయి అధికారులు, వారి సిబ్బందీ, tgo, tngo, నాయకులు పాల్గొన్నారు.

Share This Post