బతుకమ్మ పండగను అందరూ ఆనందోత్సాహాలతో జరుపుకోవాలి జిల్లా కలెక్టరేట్​లో బతుకమ్మ వేడుకల్లో పాల్గొన్న కలెక్టర్​ హరీశ్​

 

పత్రిక ప్రకటన

తేదీ : 27–09–2022

బతుకమ్మ పండగను అందరూ ఆనందోత్సాహాలతో జరుపుకోవాలి
జిల్లా కలెక్టరేట్​లో బతుకమ్మ వేడుకల్లో పాల్గొన్న కలెక్టర్​ హరీశ్​
మేడ్చల్​ – మల్కాజిగిరి జిల్లా వ్యాప్తంగా బతుకమ్మ పండగను అందరూ ఆనందోత్సాహాల మధ్య జరుపుకోవాలని ఈ మేరకు జిల్లా కలెక్టరేట్​ ఆవరణలో బతుకమ్మ సంబరాలు ఎంతో ఘనంగా నిర్వహిస్తున్నామని జిల్లా కలెక్టర్​ హరీశ్​ అన్నారు. మంగళవారం సాయంత్రం కలెక్టరేట్​ ఆవరణలో బతుకమ్మ ఉత్సవాలను కలెక్టర్​ సందర్శించారు. ఈ సందర్భంగా అక్కడ ఉన్న చిన్నారులు, విద్యార్థినులతో కలెక్టర్​ హరీశ్​ ముచ్చటించారు. భవిష్యత్తులో విద్యార్థినులు, చిన్నారులు మంచి ఉన్నత శిఖరాలకు ఎదగాలని ఆకాంక్షించారు. విద్యార్థినులు, మహిళా ఉద్యోగులు, సిబ్బంది పండగను ఘనంగా జరుపుకోవడం ఎంతో ఆనందంగా ఉందని తెలిపారు. కలెక్టరేట్​ ఆవరణలో ఏర్పాటు చేసిన బతుకమ్మలను కలెక్టర్​ హరీశ్​ పరిశీలించారు. ప్రతి ఆడపడుచూ, చిన్నాపెద్దా తేడాలు లేకుండా తెలంగాణ ప్రాంతంలో జరుపుకొనే పూల పండగ బతుకమ్మ అని అన్నారు. ఈ మేరకు ప్రభుత్వ సూచనల ప్రకారం అక్టోబర్​ 3వ తేదీ వరకు తొమ్మిది రోజుల పాటు పండగను ఘనంగా నిర్వహించడానికి అవసరమైన ఏర్పాట్లు చేశామని… రాత్రివేళ కూడా ఇబ్బంది కలగకుండా విద్యుత్తు లైట్లను అమర్చాలని సంబంధిత శాఖ అధికారులకు సూచించారు. అనంతరం కోలటాలు, బతుకమ్మ ఆటలతో సందడిని కలెక్టర్​ హరీశ్​ తిలకించారు. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారిణి విజయకుమారి, కలెక్టరేట్​ ఏవో వెంకటేశ్వర్లు, ఆయా శాఖల మహిళా అధికారులు, సిబ్బంది, విద్యార్థినులు, చిన్నారులు తదితరులు పాల్గొన్నారు.

Share This Post