బతుకమ్మ పండుగ వేడుకలను మహిళలు సంప్రదాయబద్దంగా నిర్వహించుకోవాలి – జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్.

బతుకమ్మ పండుగను తెలంగాణ మహిళలు సంప్రదాయబద్దంగా ఆడుకోవడం అభినందనీయమని, జిల్లా లోని మహిళలందరికీ బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు అని జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. బతుకమ్మ మొదటిరోజైన బుధవారం నాడు కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో బతుకమ్మ వేడుకలను నిర్వహించారు. తొలుత గౌరీ దేవి బతుకమ్మకు సాంప్రదాయ పూజ కార్యక్రమాలను కలెక్టర్ నిర్వహించారు. బతుకమ్మ ను తలపై పెట్టుకొని బతుకమ్మ ఆడే ప్రాంగణానికి కలెక్టర్ తీసుకొని వచ్చి బతుకమ్మ పాటపై ఆటలు ఆడారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ, కోవిడ్ కారణంగా పండగలను నిర్వహించుకోలేక పోయామని, ప్రస్తుతం కోవిడ్ అదుపులో ఉన్నందున పండుగలను నిర్వహించుకుంటున్నామని తెలిపారు. అయినప్పటికీ ప్రతి ఒక్కరు కోవిడ్ నిబంధనలు పాటించాలని కోరారు. జిల్లా లోని ప్రతి ఒక మహిళా సౌభాగ్యంగా, ఆనందంగా ఉండాలని కోరారు. ఈ కార్యక్రమం లో జిల్లా సంక్షేమ అధికారి మిల్కా, సీడీపీఓ వనజ, ICDS సూపర్ వైజర్లు, అంగన్వాడీలు, కలెక్టర్ బంధువులు, తదితరులు పాల్గొన్నారు.

Share This Post