బతుకమ్మ పండుగ అనేది మహిళా శక్తికి, మహిళా సాధికారతకు నిదర్శనమయిన పండుగని, బాలికల చదువు, వారి ఆరోగ్యం, న్యూట్రిషన్ కొరకు అందరము పాటుపడధమని జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి అన్నారు.

పత్రిక ప్రకటన                                                 తేది: 11-10-2021

బతుకమ్మ పండుగ అనేది మహిళా శక్తికి, మహిళా సాధికారతకు నిదర్శనమయిన పండుగని, బాలికల చదువు, వారి ఆరోగ్యం, న్యూట్రిషన్ కొరకు అందరము  పాటుపడధమని జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి అన్నారు.

సోమవారం  కల్లెక్టరేట్ ఆవరణలో అన్ని  ప్రభుత్వ శాఖల సమన్వయంతో ఏర్పాటు చేసిన బతుకమ్మ వేడుకలలో  జిల్లా కలెక్టర్ , మరియు జెడ్పి చైర్మన్ సరిత తిరుపతయ్య , పాల్గొన్నారు.

ఈ సందర్బంగా కలెక్టర్  మాట్లాడుతూ ఈరోజు  అంతర్జాతీయ బాలికల దినోత్సవం ఉందని , ఇదే రోజు బతుకమ్మ సంబరాలు జరుపుకోవడం అభినందనీయం అన్నారు. జిల్లా అధికారులందరు ఇంత తక్కువ సమయం లో సుందరమయిన బతుకమ్మలను తయారు చేసి ఆహ్లాధమయిన పండగ వాతావరణాన్ని తీసుకొచ్చారు. ఇదే  స్ఫూర్తి తో అందరు కుడా బాగా పని చేయాలనీ కోరారు. ప్రతి ఒక్కరు బతుకమ్మ వలే సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు.

జెడ్పి చైర్మన్ సరిత తిరుపతయ్య  మాట్లాడుతూ ఈ కార్యక్రామానికి ఆహ్వానించినందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. బతుకమ్మ పాటను పాడి పండగ యొక్క విశిష్ట త ను తెలిపారు.

తదనంతరం జిల్లా కలెక్టర్, జెడ్పి చైర్మన్, జిల్లా  అధికారులు ,  అందరితో కలిసి బతుకమ్మ ఆడారు.

 

ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు మహిళలు ప్రజలు పాల్గొన్నారు.

—————————————————————————

జిల్లా పౌరసంబంధాల అధికారి జోగులాంబ గద్వాల గారి చే  జారీ చేయడమైనది.

Share This Post