బతుకమ్మ పండుగ తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక అని జిల్లా అదనపు కలెక్టర్ టిఎస్. దివాకర అన్నారు.

* ప్రచురణార్థం *
జయశంకర్ భూపాలపల్లి అక్టోబర్ 12 (మంగళవారం).

బతుకమ్మ పండుగ తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక అని జిల్లా అదనపు కలెక్టర్ టిఎస్. దివాకర అన్నారు. మంగళవారం కలెక్టర్ కార్యాలయ ఆవరణలో ప్రభుత్వం అధికారికంగా నిర్వహించిన బతుకమ్మ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన జిల్లా అదనపు కలెక్టర్ మున్సిపల్ చైర్ పర్సన్ షెగ్గెం వెంకటరాణి మరియు జిల్లా అధికారులతో కలిసి కాసేపు మహిళలతో బతుకమ్మ ఆడారు. ఈ సందర్భంగా జిల్లా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ పువ్వులను పూజించే అరుదైన పండుగ బతుకమ్మ పండుగ అని ఈ పండుగ తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాలకు అద్దం పడుతూ మహిళలందరూ సంతోషంగా జరుపుకునే పండుగని ఈ పండుగలో జిల్లాలోని పేద, ధనిక అనే భేదం లేకుండా మహిళలందరూ సంతోషంగా పాల్గొనేందుకు జిల్లా వ్యాప్తంగా 1 లక్ష 42750 చీరలను ప్రభుత్వం తరఫున ఉచితంగా పంపిణీ చేయడం జరిగిందని అన్నారు. అదేవిధంగా మహిళలు ప్రశాంతంగా పండగ వాతావరణంలో సద్దుల బతుకమ్మ పండుగను నిర్వహించుకోవడం కోసం జిల్లా వ్యాప్తంగా అన్ని గ్రామాలలో మరియు భూపాలపల్లి మున్సిపాలిటీలో బతుకమ్మ ఆడే మైదానాల్లో విద్యుత్తు, త్రాగునీరు సమకూర్చి, ల్యాండ్ లెవెలింగ్ తదితర ఏర్పాట్లతో పాటు బతుకమ్మలను నిమజ్జనం చేయడానికి నీటి వనరుల వద్ద ప్రత్యేక ఏర్పాట్లు చేశామని తెలిపారు. కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన బతుకమ్మ పండుగ కార్యక్రమంలో అధిక సంఖ్యలో మహిళలు పాల్గొనడం సంతోషంగా ఉందని తెలిపారు.
ఈ సందర్భంగా మున్సిపల్ చైర్ పర్సన్ షెగ్గెం వెంకటరాణి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ పండుగలకు విశేష ఆదరణ లభిస్తుందని ప్రభుత్వం రైతులు, మహిళలు, కులవృత్తుల వారు, వీధి వ్యాపారులు, నిరుపేదలు తదితర అన్ని వర్గాల అభ్యున్నతి కోసం చేపట్టిన వివిధ కార్యక్రమాల వలన మరియు కాలేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం వలన పాడి పంటలు సమృద్ధిగా పండి ప్రజలందరూ సంతోషంగా బతుకమ్మ పండుగలో పాల్గొంటున్నారని తెలిపారు. తొమ్మిది రోజులు జరుపుకునే ఈ బతుకమ్మ పండుగకు ప్రతి రోజు ఒక ప్రత్యేకత ఉందని అన్నారు.
ఈ సందర్భంగా మహిళలు ఆనందంగా బతుకమ్మ పాటలను పాడుతూ ఉత్సాహంగా బతుకమ్మ ఆడారు.

ఈ కార్యక్రమంలో జడ్పీ వైస్ చైర్ పర్సన్ కళ్లెపు శోభ, భూపాలపల్లి, మహాదేవపూర్ ఎంపీపీలు మందల లావణ్య, రాణి భాయి, జెడ్పీ సీఈవో శోభారాణి, డిఆర్డిఓ పురుషోత్తం, ఇంచార్జి జిల్లా సంక్షేమ అధికారి కె. శామ్యూల్, డిపిఓ ఆశాలత, జిల్లా బిసి అభివృద్ధి అధికారిణి శైలజ, జిల్లా ఎస్సీ అభివృద్ధి అధికారిణి సునీత, ఐసిడిఎస్ సిడిపిఓ అవంతిక, డిపిఆర్ఓ రవికుమార్, ఎంపీడీవోలు, ఎంపివోలు, అంగన్వాడి టీచర్లు, సెర్ఫ్ అధికారులు, స్వయం సహాయక సంఘాల మహిళలు కలెక్టర్ కార్యాలయం మరియు వివిధ శాఖల అధికారులు, సిబ్బంది, మహిళలు, యువతులు, తెలంగాణ సాంస్కృతిక సారధి కళాకారులు తదితరులు పాల్గొన్నారు.

డిపిఆర్ఓ జయశంకర్ భూపాలపల్లి జిల్లా గారిచే జారీ చేయడమైనది.

Share This Post