బతుకమ్మ పండుగ వేడుకలను ఘనంగా నిర్వహించాలి : జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి

బతుకమ్మ పండుగ వేడుకలను ఘనంగా నిర్వహించాలి : జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి
——————————-

జిల్లాలో బతుకమ్మ పండుగ వేడుకలను ఈనెల 26 నుంచి అక్టోబర్ మూడో తేదీ వరకు ఒక్కో రోజు ఒక్కో నేపథ్యంతో ఘనంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి అధికారులను ఆదేశించారు.
ఇందుకోసం ప్రత్యేకంగా నోడల్ అధికారులను నియమిస్తున్నట్లు తెలిపారు.

సోమవారం కలెక్టరేట్లో ప్రజావాణిని పురస్కరించుకొని జిల్లా కలెక్టర్ ప్రజల నుంచి ఫిర్యాదులు వినతులను స్వీకరించారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ అన్ని మండలాల ప్రత్యేక అధికారులు తమ పరిధిలోని గురుకులాలను తనిఖీ చేయాలన్నారు. విద్యార్థులకు నాణ్యమైన ఆహారం, సురక్షిత త్రాగునీరు, పోషకాహరం అందుతుందో లేదో పరిశీలించాలని అన్నారు.
విద్యార్థుల ఆరోగ్య పరిస్థితిని వాకబ్ చేయాలన్నారు. వారం రోజుల్లో సంబంధిత తనిఖీ రిపోర్ట్ తనకు అందజేయాలని సూచించారు.
పోడు భూముల అర్జీల పరిశీలనకు క్షేత్రస్థాయిలో ఇప్పటికే బృందాలను నియమించామని జిల్లా కలెక్టర్ తెలిపారు. వ్యవసాయ విస్తరణ అధికారి, సర్వే అధికారులు, పంచాయతీ కార్యదర్శి లు క్షేత్రస్థాయికి వెళ్లి చెక్ లిస్ట్ ప్రకారం అన్ని వివరాలను పరిశీలించి ప్రాథమిక జాబితాను సిద్ధం చేసుకోవాలన్నారు తదనంతరం వచ్చే ప్రభుత్వ ఉత్తర్వులకు అనుగుణంగా వాటిపై ముందుకు వెళతామని తెలిపారు.

వర్షాలు కొంతమేర తగ్గుముఖం పట్టినప్పటికీ వచ్చే రెండు మూడు నెలలు డెంగ్యూ , ఇతర సీజనల్ వ్యాధులు వ్యాప్తి చెందకుండా పంచాయితీ, మున్సిపల్ అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా ఉండాలన్నారు. జిల్లాలో ఎక్కడ వాటర్ నిల్వ ఉండకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ప్రతి ఆదివారం 10 గంటల 10 నిమిషాల కార్యక్రమం తో పాటు డ్రైడేను నిర్దేశిత షెడ్యూల్ ప్రకారం క్రమం తప్పకుండా నిర్వహించాలన్నారు.

కాగా ప్రజావాణి కార్యక్రమం కు మొత్తం 20 ఫిర్యాదులు,వినతులు వచ్చాయి. Revenue – 12
DMHO – 1
DWO – 2
MC Sircilla – 2
DPO – 1
MPDO Thangallapalli – 1
Cess – 1

సమావేశంలో జిల్లా అదనపు కలెక్టర్లు బి సత్యప్రసాద్, ఖీమ్యా నాయక్ ఆర్డీవోలు టి శ్రీనివాసరావు , పవన్ కుమార్, జిల్లా అధికారులు పాల్గొన్నారు.
——————————–

 

Share This Post