బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహించాలి:- జిల్లా కలెక్టర్ డి హరిచందన
తెలంగాణా రాష్టం ఏర్పాటు అయినప్పటి నుంచి రాష్ట ప్రభుత్వం ప్రతి జిల్లా మండల కేంద్రాలలో బతుకమ్మ సంబరాలు జరుపుకోవడం జారుతుంది. కొత్తగా ఏర్పడిన నారాయణపేట జిల్లా లో బతుకమ్మ వేడుకలను అక్టోబర్ 7వ తేది నుంచి నిర్వహించే బతుకమ్మ కార్యక్రమన్ని ఘనంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ డి హరిచందన తెలిపారు. శుక్రవారం జిల్లా కేంద్రం లోని పురాతన బారం బావి దగ్గర వేడుకలను ఏర్పాటు చేయాలనీ అధికారులకు ఆదేశించారు. బారం బావి పరిశాలను పరిశీలించి చుట్టూ పరిశుబ్రం చేయాలనీ సూచించారు. ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొనే అవకాశం ఉన్నందున తగిన జాగ్రతలు చేపడుతు నిర్వహించాలని సూచించారు.
ఈ కార్యక్రమం లో అదనపు కలెక్టర్ కె చంద్ర రెడ్డి, మున్సిపల్ కమిషనర్ భాస్కర్ రెడ్డి, మున్సిపల్ చైర్పర్సన్ గందే అనుసుయ్య చంద్రకాంత్, వైస్ చైర్మన్ హరినరయన్ భట్టాడ్ తదితరులు పాల్గొన్నారు.