బదిలీ పై ఖమ్మం జిల్లా మునిసిపల్ కమీషనర్ గా వెల్లుచున్న జిల్లా అదనపు కలెక్టర్ ఆదర్శ సురభి గారికి వీడ్కోలు సమావేశం

వార్త ప్రచురణ
తేదీ.20.09.2021

ములుగు జిల్లా

*ప్రభుత్వo ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పల్లె ప్రగ్రతి పనులు బేష్ : జిల్లా కలెక్టర్ కృష్ణ ఆదిత్య*

*బాస్ ఇస్ ఆల్వేస్ రైట్: అదనపు కలెక్టర్ ఆదర్శ సురభి *

కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాలులో జిల్లా కలెక్టర్ ఎస్. కృష్ణ ఆదిత్య గారి అధ్యక్షతన బదిలీ పై ఖమ్మం జిల్లా మునిసిపల్ కమీషనర్ గా వెల్లుచున్న జిల్లా అదనపు కలెక్టర్ ఆదర్శ సురభి గారికి వీడ్కోలు సమావేశం ఏర్పాటు చేయ నైనది.

అదనపు కలెక్టర్ ఆదర్శ సురభి నుద్దేశించి జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, ప్రభుత్వo ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పల్లె ప్రగ్రతి పనులు చాల బాగా చేసారని , ఉద్యోగులతో కలిసి జిల్లా అభివృద్ధి లో మమేకమై పనులు నిర్వహించారని, ఇదే స్పూర్తి తో మునుముందు పని చేయాలని కలెక్టర్ అన్నారు .

ఈ సందర్భంగా బదిలీ పై వెళ్ళుతున్న అదనపు కలెక్టర్ ఆదర్శ గారు మాట్లాడుతూ జిల్లా కలెక్టర్ గారి తో కలిసి పని చేయడం సంతోషంగా ఉందని, బాస్ ఈజ్ ఆల్వేస్ రైట్ అనే విధంగా మా బాస్ జిల్లా కలెక్టర్ గారు వారు ఏది చెప్తే అది చేయుటకు ఉత్సాహంగా ముందుండి పనులు చేసామని వారు అన్నారు. జిల్లా అధికారులతో కలిసి వర్క్ చేయడం ,వారు సహకరించిన తీరుకు ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు.
ఈ సందర్భంగా ఆర్డీవో రమాదేవి గారు మాట్లాడుతూ అదనపు కలెక్టర్ ఆదర్శ సురభి గారు ములుగు జిల్లా కు మొట్టమొదటి లోకల్ బాడీ అదనపు కలెక్టర్ గా వచ్చి కొద్ది రోజుల్లోనే జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు జిల్లా యంత్రాంగాన్ని దిశా నిర్దేశం చేయడంలో చాలా విశ్లేషనాత్మకంగా జిల్లాను అభివృద్ది పదంలో నడిపించారు అని వారు అన్నారు.

అలాగే జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి  డా.అప్పయ్య గారు మాట్లాడుతూ, అదనపు కలెక్టర్ గారు ప్రతి ఇష్యూలో త్వరిత గతిన పనులు పూర్తి చేసే దిశగా  ముందు చూపుతో పనులను ఒక ప్రణాళిక ప్రకారం పూర్తిచేసి జిల్లాను ప్రగతిపథంలో నడిపించేందుకు చాలా కృషి చేశారని వారు అన్నారు.

ఎపీడి శ్రీనివాస్ గారు మాట్లాడుతూ జిల్లాలో KFC లాంటి పిజ్జా కార్నర్ కూడా ములుగుజిల్లా ప్రజలకు పరిచయం చేయడం అదనపు కలెక్టర్ గారి గొప్పతనం అని వారు అన్నారు. చిన్న చిన్న సంఘాలతో కూడా మాట్లాడి వారుఎదైతే చేయగలుగుతారో అది చేసేలా వారిని ప్రేరేపించేలా చేసి సంఘాలకు చేయూతనిచ్చారని వారు అన్నారు.
ఈ కార్యక్రమం లో జిల్లా అధికారులు ఎస్సి కార్పొరేషన్ ఇడి రవి , జడ్పి సిఇవో ప్రసూనా రాణి , కలెక్టరేట్ ఎఓ శ్యాం ,రెవెన్యు అధికారులు ,జిల్లా అధికారులు, పంచాయితి సెక్రెటరీలు, తదితరులు పాల్గొన్నారు.

 

 

Share This Post