బమ్మెర పర్యాటక అభివృద్ధి పనులు త్వరితగతిన పూర్తి చేయాలి:: జిల్లా కలెక్టర్ సిహెచ్. శివలింగయ్య

జనగామ, అక్టోబర్ 9: బమ్మెర లో చేపడుతున్న పర్యాటక అభివృద్ధి పనులు త్వరితగతిన పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ సిహెచ్. శివలింగయ్య అన్నారు. శనివారం పాలకుర్తి మండలం బమ్మెర గ్రామంలో జిల్లా కలెక్టర్ పర్యటించి, పనుల పురోగతిని తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రూ. 7.5 కోట్ల వ్యయ అంచనాలతో బమ్మెర లో అక్షరాభ్యాసం హాల్, ఫుడ్ కోర్టు, అంఫి ధియేటర్, టాయిలెట్ బ్లాక్ నిర్మాణ పనులు చేపట్టినట్లు తెలిపారు. పర్యాటక అభివృద్ధి పనులు 80 శాతం వరకు పూర్తి అయినట్లు ఆయన అన్నారు. అధికారులు పనుల పురోగతిని రోజువారీ పర్యవేక్షణ చేయాలన్నారు. పనులు ప్రతీ రోజు జరిగేట్లు చూడాలని ఆయన తెలిపారు. నాణ్యతలో రాజీపడవద్దని కలెక్టర్ అధికారులను ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో కాకతీయ హెరిటేజ్ సంస్థ ప్రతినిధి ప్రొ. పాండురంగారావు, అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) అబ్దుల్ హమీద్, స్టేషన్ ఘనపూర్ ఆర్డీవో కృష్ణవేణి, ఆర్ అండ్ బి ఎస్ఇ నాగేందర్ రావు, ఈఈ హుస్సేన్, జిల్లా పర్యాటక అభివృద్ధి అధికారి గోపాల్ రావు, డిపిఓ రంగాచారి, మండల ప్రత్యేక అధికారి నూరో, స్థానిక ప్రజాప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.

జిల్లా పౌరసంబంధాల అధికారి, జనగామచే జారిచేయనైనది.

Share This Post