బయోటెక్, ఫార్మారంగాల్లో భారతదేశం అగ్రస్థానంలో ఉంది భారతదేశ ఉపరాష్ట్రపతి డాక్టర్ వెంకయ్యనాయుడు భారత్ బయోటెక్‌ను సందర్శించిన ఉపరాష్ట్రపతి డాక్టర్ వెంకయ్యనాయుడు ఢిల్లీ నుంచి ప్రత్యేక వాయుసేన విమానంలో హకీంపేట విమానాశ్రయానికి వచ్చిన ఉపరాష్ట్రపతికి స్వాగతం పలికిన రాష్ట్ర హోమ్‌శాఖ మంత్రి మహమూద్ అలీ

పత్రిక ప్రకటన–1 తేదీ : 30–07–2021
=======================================================================================================
బయోటెక్, ఫార్మారంగాల్లో భారతదేశం అగ్రస్థానంలో ఉంది
భారతదేశ ఉపరాష్ట్రపతి డాక్టర్ వెంకయ్యనాయుడు
భారత్ బయోటెక్‌ను సందర్శించిన ఉపరాష్ట్రపతి డాక్టర్ వెంకయ్యనాయుడు
ఢిల్లీ నుంచి ప్రత్యేక వాయుసేన విమానంలో హకీంపేట విమానాశ్రయానికి వచ్చిన
ఉపరాష్ట్రపతికి స్వాగతం పలికిన రాష్ట్ర హోమ్‌శాఖ మంత్రి మహమూద్ అలీ
కరోనా సంక్షోభంలో దేశీయ సంస్థలు వ్యాక్సిన్ అందించి ఆదుకున్నాయి
భారత్ బయోటెక్ శాస్త్రవేత్తలనుద్దేశించి మాట్లాడిన ఉపరాష్ట్రపతి డాక్టర్ వెంకయ్య నాయుడు
భారతదేశం బయోటెక్, ఫార్మారంగాల్లో ప్రపంచదేశాల్లోనే అగ్రస్థానంలో నిలిచిందని ఈ విషయంలో కరోనా విపత్కర సంక్షోభ సమయంలో భారత్ బయోటెక్ వంటి దేశీయ సంస్థలు ఎంతో కృషి చేశాయని భారతదేశ ఉపరాష్ట్రపతి డాక్టర్ వెంకయ్య నాయుడు అన్నారు. శుక్రవారం ఢిల్లీ నుంచి భారత వాయుసేన ప్రత్యేక విమానంలో హకీంపేట విమానాశ్రయానికి చేరుకున్న ఉపరాష్ట్రపతి డాక్టర్ వెంకయ్యనాయుడుకు రాష్ట్ర హోమ్ శాఖ మంత్రి మహమూద్‌అలీ, అధికారులు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం విమానాశ్రయం నుంచి రోడ్డు మార్గంలో తుర్కపల్లిలోని భారత్ బయోటెక్ జీనోమ్ వ్యాలీకి చేరుకొన్నారు. ఈ సందర్భంగా ఉపరాష్ట్రపతి డాక్టర్ వెంకయ్యనాయుడుకు అక్కడ ఉన్న శాస్త్రవేత్తలు సంస్థలోని కరోనా ప్రధాన వ్యాక్సిన్ తయారీ విభాగాలను వాటి ఉత్పత్తి తీరును పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా వివరించారు. అనంతరం సంస్థలోని వివిధ విభాగాలకు చెందిన సుమారు పలువురు ప్రధాన శాస్త్రవేత్తలతో ఉపరాష్ట్రపతి సమావేశమయ్యారు. ఈ మేరకు భారత్ బయోటెక్ సంస్థ ద్వారా కరోనా కోవ్యాక్సిన్ ఎంత మేర ఎంత మందికి అందించారు వ్యాక్సిన్ ఎలా పని చేస్తుంది ఇంకా ఎంత అందించేందుకు వీలుందనే వివరాలతో పాటు వ్యాక్సిన్‌కు సంబంధించిన విషయాలను ఉపరాష్ట్రపతి అక్కడ పని చేస్తున్న శాస్త్రవేత్తలను అడిగి తెలుసుకొన్నారు. అనంతరం అక్కడ ఉన్న శాస్త్రవేత్తలనుద్దేశించి ఉపరాష్ట్రపతి డాక్టర్ వెంకయ్య నాయుడు ప్రసంగించారు. ఈ సందర్భంగా ఉపరాష్ట్రపతి మాట్లాడుతూ ప్రపంచ దేశాల్లోని అగ్రదేశాలకు సమానస్థాయిలో మన దేశం బయోటెక్, ఫార్మారంగాల్లో అగ్రస్థానంలో ఉందని కరోనా వంటి విపత్కర సంక్షోభ సమయంలో దేశీయ సంస్థ అయిన భారత్ బయోటెక్ తమ పరిశోధనల ద్వారా వ్యాక్సిన్లను అందుబాటులోకి తీసుకువచ్చి ప్రజలను ఆదుకోవడంతో పాటు ఎందరో ప్రాణాలను కాపాడేందుకు కోవ్యాక్సిన్ తయారు చేయడం దేశానికి గర్వకారణమన్నారు. ప్రస్తుతం దేశంలోని ఆయా రాష్ట్రాలతో పాటు అనేక ఫార్మా, బయోటెక్ పరిశోధన సంస్థలకు హైదరాబాద్ కేంద్రస్థానంగా ఉందని తెలిపారు. ఆయా పరిశోధనలు, నూతన ఆవిష్కరణల ద్వారా ఈ సంస్థలు ఎంతో గుర్తింపు సాధించడంతో పాటు దేశానికి గర్వకారణంగా నిలుస్తున్నాయని ఇది ఎంతో ఆనందకరమైన విషయమని ఉపరాష్ట్రపతి డాక్టర్ వెంకయ్య నాయుడు తెలిపారు. భారత్ బయోటెక్‌లోని శాస్త్రవేత్తల కృషి ఎంతో ప్రశంసనీయమని 45 కోట్ల మంది ప్రజలకు ఇప్పటి వరకు కరోనా వ్యాక్సిన్ వేయటం ఎంతో గొప్పవిషయమనిఈ ఏడాదిలోగా ప్రతి పౌరుడికి వ్యాక్సినేషన్ పూర్తి చేయాలని ఈ సందర్భంగా డాక్టర్ వెంకయ్యనాయుడు ఆకాక్షించారు. దేశ ప్రజలు ప్రజలు అప్రమత్తంగా ఉంటూ భౌతిక దూరం పాటిస్తూ, మాస్కులను ధరించి అవసరమైన జాగ్రత్తలు పాటించి కరోనా రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని భారతదేశ ఉపరాష్ట్రపతి డాక్టర్ వెంకయ్యనాయుడు కోరారు. ఈ కార్యక్రమంలో భారత్ బయోటెక్ సీఎండీ కృష్ణా ఎల్లా, జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ సుచిత్ర ఎల్ల పాల్గొన్నారు. ఈ సందర్భంగా హకీంపేట విమానాశ్రయంలో టీఎస్ఎస్పీ బెటాలియన్ అడిషనల్ డీజీపీ అభిలాష్ భిష్క్, , రాష్ట్ర గవర్నర్ సెక్రెటరీ సురేంద్రమోహన్, తదితరులు మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా అదనపు కలెక్టర్ నర్సింహారెడ్డి, జిల్లా రెవెన్యూ అధికారి లింగ్యానాయక్ తదితరులు పాలొగొన్నారు

Share This Post