బయోమెడికల్ వేస్ట్ మేనేజ్మెంట్ 2016 నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి:: జిల్లా కలెక్టర్ డాక్టర్ సంగీత సత్యనారాయణ
జిల్లాలోని ప్రతి ఆరోగ్య సంబంధిత కేంద్రం బయోమెడికల్ వేస్ట్ కింద రిజిస్టర్ కావాలి
మున్సిపాలిటీలలో ఘన వ్యర్ధాలు బయో వ్యర్థాలతో కలపరాదు
బయోమెడికల్ వేస్ట్ మేనేజ్మెంట్ పై రివ్యూ నిర్వహించిన జిల్లా కలెక్టర్
పెద్దపల్లి మే 10:– బయో మెడికల్ వేస్ట్ మేనేజ్మెంట్ 2016 నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ సంగీత సత్యనారాయణ సంబంధిత అధికారులను ఆదేశించారు. బయో మెడికల్ వేస్ట్ మేనేజ్మెంట్ పై మంగళవారం కలెక్టరేట్లోని తన చాంబర్లో సంబంధిత అధికారులతో కలెక్టర్ రివ్యూ నిర్వహించారు.
జిల్లాలో ఉన్న ప్రభుత్వ ,ప్రైవేట్ ఆస్పత్రులు, డయాగ్నొస్టిక్ కేంద్రాలు, ఆరోగ్య సంబంధిత కేంద్రాలు బయో వేస్ట్ మేనేజ్మెంట్ కింద పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వద్ద రిజిస్టర్ చేయించుకోవాలని ని కలెక్టర్ ఆదేశించారు.
పెద్దపల్లి జిల్లాలో బయోమెడికల్ వేస్ట్ మేనేజ్మెంట్ కోసం కేటాయించిన వెంకటరమణ ఇన్సినరేటర్ వారు ప్రతిరోజు ఆస్పత్రిలో ఆరోగ్య కేంద్రాల వద్ద నుంచి బయో వేస్ట్ నిబంధనల ప్రకారం తరలించాలని కలెక్టర్ ఆదేశించారు. జిల్లాలోని మున్సిపాలిటీలు గ్రామాలలో ఘన వ్యర్ధాల తో బయో వేస్ట్ కలవకుండా పకడ్బందీ చర్యలు చేపట్టాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు.
జిల్లాలో ఆర్ఎంపీ వైద్యుల వద్ద సైతం ప్రతిరోజు బయోవేస్ట్ సేకరించే విధంగా చర్యలు తీసుకోవాలని, బయోమెడికల్ వేస్ట్ మేనేజ్మెంట్ 2016 నిబంధనలు పాటించని వారిపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని కలెక్టర్ హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో డి.సి.పి రవీందర్,జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ ప్రమోద్ కుమార్, డి.సి.హెచ్.ఎస్. డాక్టర్ మందల వాసుదేవరెడ్డి,రామగుండం మున్సిపల్ కమిషనర్ సుమన్ రావు,పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ రీజనల్ అధికారి రామగుండం రవి,అసిస్టెంట్ శాస్త్రవేత్త మహేష్ సంబంధిత అధికారులు, సింగరేణి NTPC ఆస్పత్రి ప్రతినిధులు తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.