బలహీన వర్గాల స్ఫూర్తి ప్రధాత ఆచార్య కొండా లక్ష్మణ్‌ బాపూజీ : జిల్లా కలెక్టర్‌ రాహుల్‌రాజ్‌

తెలంగాణ స్వాతంత్ర సమరయోధుడు, నిబద్ధత కలిగిన రాజకీయ వేత్త, బలహీన వర్గాల స్ఫూర్తి ప్రధాత ఆచార్య కొండా లక్ష్మణ్‌ బాపూజీ అని జిల్లా కలెక్టర్‌ రాహుల్‌రాజ్‌ అన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్‌ భవనంలో నిర్వహించిన జయంతి ఉత్సవాలలో జిల్లా అదనపు కలెక్టర్‌ వరుణ్‌రెడ్ది, జిల్లా పరిషత్‌ చైర్‌పర్సన్‌ కోవ లక్ష్మీతో కలిసి కొండా లక్ష్మణ్‌ బాపూజీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్చించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్‌ మాట్లాడుతూ ఆచార్య కొండా లక్ష్మణ్‌ బాపూజీ వాంకిడి మండలంలో జన్మించడం గర్వంగా ఉందని, చిన్న వయసులోనే ఎన్నో కష్టాలను అనుభవించారని, స్వాతంత్ర ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్నారని, న్యాయవాదిగా బడుగు బలహీన వర్గాల వారికి తన వంతు సహాయ సహకారాలు అందించారని అన్నారు. ఆసిఫాబాద్‌ నియోజకవర్గ తొలి శాసన సభ్యులుగా పదవి నిర్వహించారని, తెలంగాణ ఉద్యమంలో తన పదవికి రాజీనామా చేసిన మొట్టమొదటి వ్యక్తి అని అన్నారు. తెలంగాణ సాధన పోరాటంలో ప్రధాన భూమిక పోషించారని, ఉద్యమం కోసం ముఖ్యమంత్రి పదవిని తృణప్రాయంగా వదిలివేశారని తెలిపారు. కొండా లక్ష్మణ్‌ బాపూజీ ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలని తెలిపారు.

ఈ కార్యక్రమంలో ఎం.పి.పి. అరిగెల మల్లికార్జున్‌, పద్మశాలి సంఘం నాయకులు, సంబంధిత శాఖల అధికారులు
తదితరులు పాల్గొన్నారు

కుమ్రంభీం ఆసిఫాబాద్‌ జిల్లా పౌర సంబంధాల అధికారిచే జారీ చేయడమైనది.

Share This Post