బవిష్యత్ ఓటర్లుకు, యువ ఓటర్లుకు ఎన్నికలు నిర్వహణ పట్ల సమగ్ర అవగాహన కల్పించుటకు ప్రచార కార్యక్రమాలు నిర్వహించాలని అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు తెలిపారు.

బుధవారం కలెక్టరేట్ సమావేశపు హాలు నుండి స్వీప్ (సిస్టమాటిక్ ఓటర్స్ ఎడ్యుకేషన్ అండ్ ఎలక్టోరల్ పార్టిసిపేషన్ ప్రోగ్రాం)పై డిఆర్డిఓ, విద్యా, జడ్పీ, అన్ని మండలాల తహసిల్దారులతో వీడియో కాన్ఫరెన్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భవిష్యత్, యువ ఓటర్లు, గ్రామీణ ఓటర్లుకు ఎన్నికల ప్రక్రియపై అవగాహనకు ఓటరు అక్షరాస్యతను ప్రోత్సహించు విదంగా భారత ఎన్నికల సంఘం యొక్క ప్రధాన కార్యక్రమంగా చేపట్టినట్లు ఆయన వివరించారు. ఎన్నికల ప్రక్రియ గురించి విద్యార్థులకు అవగాహన కల్పించుటకు చర్యలు చేపట్టాలని చెప్పారు. ఫ్రీ అండ్ ఫెయిర్ ఎన్నికలు నిర్వహణకు, ఓటరు నమోదు ప్రక్రియ, విలువలతో కూడిన ఓటింగ్, వివిప్యాట్, ఈవియంలు వినియోగం యొక్క పరిపుష్టమైన ప్రజాస్వామ్యానికి పునాదులు వేసేందుకు అవగాహన చాలా అవసరమని చెప్పారు. ఎన్నికల పట్ల ప్రజలకు పూర్తి స్థాయిలో అవగాహన ఉండాలని, అపుడే ఎన్నికలు స్వేచ్చగా, నిష్పక్షపాతంగా జరగడానికి అవకాశం ఉంటుందని చెప్పారు. బలమైన ప్రజాస్వామ్యాన్ని నిర్మించేందుకు చేపట్టిన లక్ష్యం నెరవేరాలంటే ఓటర్లలో అవగాహన చాలా అవసరమని చెప్పారు. భవిష్యత్ ఓటర్లుకు ఓటు విలువ, ఓటింగ్ ప్రక్రియ పట్ల పూర్తి అవగాహన ముఖ్యమని చెప్పారు. పాఠశాలలు, కళాశాలల్లో స్వీప్ కార్యక్రమాలు నిర్వహించాలని చెప్పారు. విద్యార్థులకు ఆసక్తి కలిగించే చిన్న, చిన్న ఆటల ద్వారా టెలిఫిల్ములు ద్వారా ఎన్నికల పట్ల అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని చెప్పారు. గరుడ మరియు ఓటర్ హెల్ప్ లైన్ యాప్స్ గురించి కూడా తెలియచేయాలని చెప్పారు. మన జిల్లాలో 170 ఎలక్టోరల్ లిటరసీ క్లబ్స్ ఉన్నాయని, వాటిని విస్తృతంగా అభివృద్ధి చేయడం, ఉన్న వాటిని బలోపేతం చేయడం, ప్రస్తుతం మన ముందున్న బాధ్యతని, ఈ బాధ్యతను అందరం ఉమ్మడిగా చేపట్టాల్సిన అవసరం ఉందని ఆయన స్పష్టం చేశారు. అనంతరం పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా స్వీప్ కార్యక్రమాలు నిర్వహణపై మాస్టర్ ట్రైనర్ కిరణ్కుమార్ వివరించారు.

 

ఈ సమావేశంలో డిఆర్డిఓ మధుసూదన్ రాజు, జిల్లా ఆడిట్ అధికారి వెంకటేశ్వరరెడ్డి, సహాకరా అధికారి వెంకటేశ్వర్లు, జడ్పీ డిప్యూటి సిఈఓ నాగలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

Share This Post