బసవేశ్వరుడు గొప్ప సంఘ సంస్కర్త, సామాజిక తత్వ వేత్త : జిల్లా రెవెన్యూ అదనపు కలెక్టర్ ఎన్. ఖిమ్యా నాయక్

బసవేశ్వరుడు… గొప్ప
సంఘ సంస్కర్త, సామాజిక తత్వవేత్త
: జిల్లా రెవెన్యూ అదనపు కలెక్టర్ శ్రీ ఖీమ్యా నాయక్

—————————-

తన ఉపదేశాలు, రచనల ద్వారా సమాజంలో మార్పు తీసుకొచ్చేందుకు ఎంతో కృషి చేసిన గొప్ప సంఘ సంస్కర్త, సామాజిక తత్వవేత్త బసవేశ్వరుడని జిల్లా రెవెన్యూ అదనపు కలెక్టర్ శ్రీ ఖీమ్యా నాయక్ కొనియాడారు.

 

అక్షయ తృతీయ సందర్భంగా మంగళవారం మహాత్మా బసవేశ్వరుని 889వ
జయంతి వేడుకలను పురస్కరించుకుని IDOC లో బసవేశ్వర చిత్రపటానికి జిల్లా అదనపు కలెక్టర్, DRO, DBCDO, DPRO లు పూలమాలలు వేసి నివాళులర్పించారు.

సర్వమానవ సమానత్వాన్ని ప్రబోధించిన విశ్వగురువుగా అందరి హృదయాల్లో బసవేశ్వరుడు చిరస్థాయిగా నిలిచిపోతారని అదనపు కలెక్టర్​ పేర్కొన్నారు. కుల, వర్ణ, వర్గ, లింగ వివక్ష లేకుండా సమసమాజ నిర్మాణం కోసం కొన్ని వందల ఏళ్ల క్రితమే బసవేశ్వరుడు కృషి చేశారన్నారు.
ఆ కాలంలోనే మహిళా సాధికారత కోసం పాటుపడిన మహోన్నతులు బసవేశ్వరుడని జిల్లా అదనపు కలెక్టర్​ కొనియాడారు.

——————————
*ప్రతిఒక్కరూ బసవేశ్వరుడి అడుగుజాడల్లో నడవాలి : జిల్లా ఇంచార్జీ రెవెన్యూ అధికారి, సిరిసిల్ల రెవెన్యూ డివిజనల్ అధికారి శ్రీ టి శ్రీనివాస్ రావు*
——————————
బసవేశ్వరుడు గొప్ప సంఘ సంస్కర్త అని,
సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక మార్పులకు శ్రీకారం చుట్టిన మహోన్నతుడు అని జిల్లా ఇంచార్జీ రెవెన్యూ అధికారి, సిరిసిల్ల రెవెన్యూ డివిజనల్ అధికారి శ్రీ టి శ్రీనివాస్ రావు
పేర్కొన్నారు.
బసవేశ్వరుని ఆచరణలు నేటికీ కొనసాగడం సంతోషకరమని, ఆయన చూపిన అడుగు జాడల్లో ప్రజలందరూ పయనించాలని అన్నారు.

జయంతి వేడుకల కార్యక్రమంలో జిల్లా వెనుబడిన తరగతుల అభివృద్ధి అధికారి శ్రీ మోహన్ రెడ్డి, జిల్లా ప్రజా సంబంధాల అధికారి శ్రీ మామిండ్ల దశరథo, వెనుబడిన తరగతుల అభివృద్ధి శాఖ అధికారులు, సిబ్బంది,
తదితరులు పాల్గొన్నారు.

—————————

Share This Post