బసవేశ్వరుని ఆశయాలు మనందరికీ ఆదర్శనీయ0…

బసవేశ్వరుని ఆశయాలు మనందరికీ ఆదర్శనీయ0…

బసవేశ్వరుని ఆశయాలు మనందరికీ ఆదర్శనీయమని జిల్లా వెనుకబడిన వెనుకబడిన తరగతుల అభివృద్ధి శాఖ అధికారి టీ శైలజ అన్నారు. మంగళవారం బసవేశ్వర జయంతి పురస్కరించుకొని భూపాలపల్లి కలెక్టరేట్లో ప్రభుత్వ ఆదేశాల ప్రకారం కార్యక్రమం నిర్వహించారు.

హైందవ మతాన్ని సంస్కరించిన ప్రముఖులలో బసవేశ్వరుడు ఒక్కరని, ప్రజలంతా విశ్వగురువు అని పిలుస్తారని శైలజ తెలిపారు. బసవేశ్వరుడు కుల వ్యవస్థ వర్ణ బేధం లింగ వివక్షతను సమూలంగా వ్యతిరేకించారని అన్నారు.

12వ శతాబ్దంలో కర్ణాటక దేశాన్ని పాలించిన బిజ్జలుని కొలువు లో ఉద్యోగం చేరి, సామర్థ్యం నిజాయితీతో ప్రధాన మంత్రి పదవి అందుకున్నారని ఆమె తెలిపారు. రాజ్య పాలనను ముఖ్య పాత్ర పోషిస్తూ వచ్చిన సాహిత్యంలో ప్రజలందరినీ కులమతాలకతీతంగా ఏకం చేశారని శైలజ తెలిపారు.
మహనీయుని బోధనలు ప్రజలంతా పాటించాలని మంచి మార్గంలో నడవాలని ఆమె ఆకాంక్షించారు.

ఈ కార్యక్రమం లో భూపాలపల్లి లింగాయత లింగబలిజ సమన్వయ సమితి అధ్యక్షులు కంపెటి రాజయ్య, కార్యదర్శి మాటూరి శ్రీనివాస్, వైస్ ప్రెసిడెంట్ నిజ లింగం, యుగేందర్, మంజుల, శివ ప్రసాద్, వసతి గృహ సంక్షేమ అధికారులు ,లెక్టరేట్ సిబ్బంది,సంబంధిత అధికారులు, తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

జిల్లా పౌర సంబంధాల అధికారి జయశంకర్ భూపాలపల్లి వారి చే జారీ చేయనైనది.

Share This Post