బస్తీ దవఖానా అంతా బాగుంది – ప్లాంటేషన్ వెంటనే పూర్తి చేయాలి – పెండింగ్ పనులు 3 రోజుల్లో పూర్తి చేయాలి : జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి

 

బస్తీ దవఖానా అంతా బాగుంది

– ప్లాంటేషన్ వెంటనే పూర్తి చేయాలి

– పెండింగ్ పనులు 3 రోజుల్లో పూర్తి చేయాలి

మున్సిపల్ అధికారులకు జిల్లా కలెక్టర్ ఆదేశం

——————————

సిరిసిల్ల లో నిర్మిస్తున్న బస్తీ దవాఖానా అంతా బాగుంది…
ఈ నెల 21 వ తేదీలోగా మొక్కలు నాటడం పాటు పెండింగ్ పనులను పూర్తి చేయాలని
మున్సిపల్ అధికారులకు జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి ఆదేశించారు.

గురువారం పురపాలక సంఘం పరిధిలోని రాజీవ్ నగర్ లో ఆర్థిక సంఘం నిధులు రూ.13 లక్షలతో నిర్మిస్తున్న ఉన్న బస్తీ దవాఖాన ను జిల్లా కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు.
దవాఖాన క్యాంపస్ లో మొక్కలు నాటాలన్నారు. దవాఖాన లో అన్ని సెక్షన్ లకు అవసరమైన సామగ్రిని వెంటనే సమకూర్చుకోవాలని అన్నారు. పెండింగ్ ఉన్న రేయిలింగ్ వర్క్ పూర్తి చేయాలన్నారు.
దవాఖాన తో పాటు టాయిలెట్ వద్ద మెట్లు ఏర్పాటు చేశారని వాటితో పాటు ర్యాంప్ కూడ ఏర్పాటు చేయాలన్నారు.

పట్టణ పేదలకు నాణ్యమైన వైద్యాన్ని ఉచితంగా అందించాలనే లక్ష్యంతో సిరిసిల్ల పురపాలక సంఘం పరిధిలో బస్తీ దవాఖానను రాష్ట్ర ప్రభుత్వం నిర్మిస్తుందనీ జిల్లా కలెక్టర్ తెలిపారు.

అన్నిరకాల సదుపాయాలు కల్పించాలి

అంతకుముందు జిల్లా కలెక్టర్ సుందరయ్య నగర్ లో సిరిసిల్ల మండల వనరుల కేంద్రం అవరణలోని భవిత సెంటర్ రెన్నోవేషన్ పనులను జిల్లా కలెక్టర్ జిల్లా విద్యాధికారి రాధా కిషన్ తో కలిసి పరిశీలించారు.

కావాల్సిన ఎక్విప్మెంట్ సమకూర్చుకునేందుకు వీలుగా ప్రతిపాదనలు సిద్ధం చేయాలని టి ఎస్ ఈ డబ్ల్యు ఐ డి సి ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ విరూపాక్ష కు
సూచించారు.
ప్రస్తుతం భవిత సెంటర్ లో శారీరక, మానసిక లోపాలున్న 12 మంది పిల్లలు భవిత కేంద్రంలో ఉన్నారు.

——————————
.

Share This Post