బహిరంగ ప్రదేశాల్లో ధూమపానం నేరం, ఉల్లంఘనలపై కఠిన చర్యలు చేపట్టాలి – జిల్లా కలెక్టర్ పి. ఉదయ్ కుమార్

బహిరంగ ప్రదేశాల్లో ఇతరులకు ఇబ్బంది కల్గించే విధంగా పోగ పీల్చడం చట్టరిత్యా నేరమని, ఇందుకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం జరిమానా, శిక్షలు విధించే అవకాశం ఉందని జిల్లా కలెక్టర్ పి.ఉదయ్ కుమార్ పేర్కొన్నారు.
మంగళవారం పపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవాన్ని పురస్కరించుకుని కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించారు.
ఈ సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ…
పొగాకు ఉత్పత్తులను వినియోగించడం వల్ల భారతదేశంలో ప్రతి రోజు 2200 మంది ప్రాణాలు కోల్పోతున్నారని, ప్రపంచ వ్యాప్తంగా 6 లక్షల మంది మరణిస్తున్నారని అన్నారు.
పొగాకు వ్యాపారులు 15 సంవత్సరాలలోపు వయస్సు ఉన్న వారికి విక్రయించకూడదని, విక్రయిస్తే వెయ్యి రూపాయల జరిమానాతో పాటు ఐదు సంవత్సరాల జైలు శిక్ష విధించేందుకు 2003 సెక్షన్ 6 ను ఉపయోగించే అవకాశం ఉందని హెచ్చరించారు. ప్రాణాంతకమైన పొగాకు మహామ్మారి నుంచి ప్రజలు తమకు తాముగా కాపాడుకోవాల్సిన అవసరం ఉందన్నారు. పొగాకు ఉపయోగం వల్ల కలిగే అనర్థాలపై విద్యావంతులు ఎప్పటికప్పుడు అవగాహన కల్పించే ప్రయత్నం చేయాలని తెలిపారు.
పొగాకు ఉత్పత్తులను నియంత్రించేందుకు ప్రభుత్వం చట్టాన్ని తీసుకువచ్చి అనేక సెక్షన్లను అమలు చేస్తుందని, ఈ వ్యవహారంలో పొరపాట్లు చేసిన వారికి రకరకాల జరిమానాలు, శిక్షలు అమలు చేయవచ్చన్నారు.
బహిరంగ ప్రదేశాలు, కార్యాలయాలు, పాఠశాలలు, కళాశాలల్లో పాన్, గుట్కా నమిలి గోడలపై ఉమ్మి వేస్తే కఠిన చర్యలు తీసుకోవాలని హెచ్చరించారు.
ప్రజలకు అవగాహన కల్పించేలా విస్తృత ప్రచార చర్యలు చేపట్టాలని ఆదేశించారు.
జిల్లా వైద్యాధికారి సుధాకర్ లాల్ మాట్లాడుతూ
జిల్లాలో ఇప్పటివరకు ఉల్లంఘనలు చేసిన 187 మందికి జరిమానాలు నిర్మించడం జరిగిందని తద్వారా వచ్చిన 4 లక్షల 200 రూపాయలను ట్రెజరీ ద్వారా ప్రభుత్వానికి జమ చేయడం జరిగిందన్నారు.
పొగాకు ఉత్పత్తులైన సిగరేట్లు, బీడీలు, జర్దాల వల్ల నోటి సంబంధమైన వ్యాధులు సంక్రమిస్తాయని, నోటికే ఇబ్బంది తలెత్తితే మొత్తం శరీరానికే ఇబ్బందిగా బావించుకోవాలన్నారు. తమకు కావల్సిన ఆహారాన్ని నోటి ద్వారా తీసుకోవాల్సి ఉంటుందని, అలాంటిది నోటి సంబంధిత వ్యాధులు సోకితే సదరు వ్యక్తి ప్రాణాలకే ప్రమాదకరమన్నారు. అంతకుముందు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ సిబ్బందితో కలిసి ప్రజలకు అవగాహన కల్పించేలా కలెక్టర్ కార్యాలయ ఆవరణలో డి ఎం హెచ్ ఓ జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో డీఎంహెచ్ఓ సుధాకర్ లాల్, జిల్లా పంచాయతీ అధికారి కృష్ణ, డిఆర్డిఎ పి.డి నర్సింగ్ రావు, డిప్యూటీ సీఈఓ భాగ్యలక్ష్మి, ప్రోగ్రామ్ ఆఫీసర్ డాక్టర్ శ్రవణ్ కుమార్, జిల్లా సైన్స్ అధికారి కృష్ణా రెడ్డి, లేబర్ అధికారి మహేష్, వైద్య ఆరోగ్య కార్యాలయ అధికారులు శ్రీనివాసులు,ఫసియుద్దీన్, ఇన్స్పెక్టర్,తదితరులు పాల్గొన్నారు.

Share This Post