బాధితులకు సరైన న్యాయం జరిగి దోషులకు శిక్ష పడేవిధంగా పోలీస్ అధికారులు, న్యాయ విభాగం సమన్వయంతో పనిచేయాలని ప్రిన్సిపల్ జిల్లా మరియు షెషన్స్ కోర్టు న్యాయమూర్తి డి. రాజేష్ బాబు సూచించారు.

బాధితులకు సరైన న్యాయం జరిగి  దోషులకు శిక్ష పడేవిధంగా పోలీస్ అధికారులు, న్యాయ విభాగం సమన్వయంతో పనిచేయాలని ప్రిన్సిపల్ జిల్లా మరియు షెషన్స్ కోర్టు న్యాయమూర్తి డి. రాజేష్ బాబు సూచించారు.  నవంబర్ 12వ తేదీన జిల్లాలో నిర్వహించనున్న జాతీయ లోక్ అదాలత్  ను విజయవంతం చేసేందుకు  సోమవారం ఉదయం రెవెన్యూ, పోలీస్ అధికారులు, పబ్లిక్ ప్రాసిక్యూటర్లతో కోర్టు హాల్లొ సమన్వయ సమావేశం నిర్వహించారు.  ఈ సందర్బంగా జస్టిస్ డి. రాజేష్ మాట్లాడుతూ 2018 కన్నా ముందు ఉన్న కేసులు ఏవి పెండింగ్ లో లేకుండా వాటిని పరిష్కరించే విధంగా చూసేందుకు లోక్ అదాలత్ ఏంతో ఉపయుక్తంగా ఉంటుందన్నారు. కోర్టు పెండింగ్ లో ఉన్న కేసులకు సంబంధించి ఇరు పార్టీలు లేదా ఎవరో ఒకరు రాజీ పడాలని అనుకునే వారు నవంబర్ 12వ తేదీన జరిగే జాతీయ లోక్ అదాలత్ కు హాజరై కేసులు పరిష్కరించుకోవచ్చన్నారు.  ఈ సదవకాశాన్ని  కక్షి దారులు సద్వినియోగం చేసుకోవాలని  కోరారు.  ఆబ్కారీ కేసులు, డ్రంక్ అండ్ డ్రైవ్, సివిల్ కేసులు అధిక మొత్తం లో రాజీ అయి పరిసరిష్కారం అయ్యేవిధంగా చూడాలని అందుకు చార్జిషీట్ లు సకాలంలో వేయాలని తెలియజేసారు.  పోలీస్ అధికారులు  చాలా సార్లు చార్జిషీట్ సకాలంలో వేయడం లేదని అదేవిధంగా చార్జిషీట్ లో ముద్దాయి నెరచరిత్ర పేర్కొనడం లేదన్నారు.  అందువల్ల ముద్దాయికి  బెయిల్ మంజూరు విషయంలో ఇబ్బందులు తలెత్తుతున్నాయని తెలిపారు.   చార్జిషీట్ వేసి వదిలేయకుండా సకాలంలో సమన్లు జారీ చేయడం,  సాక్షులను కోర్టు లో హాజరచడం వంటివి సకాలంలో జరిగితే చాలా కేసులు సత్వరం పరిష్కారం అయ్యే అవకాశం ఉంటుందన్నారు.  సాక్షులు హాజరు కాకపోవడం వల్ల చాలా కేసులు పరిష్కారం కాకుండా పెండింగ్ లో ఉండిపోతున్నాయన్నారు.  పెండింగ్ లో ఉన్న కేసులు అన్ని లోక్ అదాలత్ ద్వారా పరిష్కారం అయ్యేవిధంగా సమిష్టిగా కృషి చేయాలని ఆదేశించారు.

ఈ సమావేశంలో సీనియర్ సివిల్ జడ్జి సబితా, ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి స్వరూప, రెండవ అదనపు జూనియర్ సివిల్ జడ్జి పి. మౌనిక, అడిషనల్ ఎస్పీ  రామేశ్వర్ రావు, సి.ఐ లు, పబ్లిక్ ప్రాసిక్యూటర్లు, ఎస్.ఐ లు తదితరులు పాల్గొన్నారు.

Share This Post