బాయిల్డ్ కస్టమర్ రైస్ మిల్లింగ్ మార్చి 31 లోపు పూర్తి చేయాలి జిల్లా కలెక్టర్ శ్రీ జితేష్ వి పాటిల్

బాయిల్డ్ కస్టమర్స్ రైస్ మిల్లింగ్ మార్చి 31 లోపు పూర్తిచేయాలని జిల్లా కలెక్టర్ శ్రీ జితేష్ వి పాటిల్ అన్నారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో గురువారం రైస్ మిల్లు యజమానులతో యాసంగి దాన్యం మిల్లింగ్ పై సమీక్ష నిర్వహించారు. లక్ష్యానికి అనుగుణంగా రైస్ మిల్లు యజమానులు ధాన్యాన్ని మిల్లింగ్ చేయాలని సూచించారు. రైస్ మిల్లు ల వారీగా జరిగిన మిల్లింగ్ వివరాలను అడిగి తెలుసుకున్నారు. సమావేశంలో నిజామాబాద్ ఎఫ్ సి ఐ డివిజనల్ మేనేజర్ రిజ్వాన్ అహ్మద్, ఇంచార్జ్ జిల్లా పౌర సరఫరాల అధికారి రాజశేఖర్, సివిల్ సప్లై డిఎం జితేంద్ర ప్రసాద్, ఆర్ డి వో లు శీను, రాజా గౌడ్, రైస్మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు శ్రీనివాస్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి గౌరీశంకర్, డిప్యూటీ తహసీల్దార్లు, రెవెన్యూ ఇన్స్పెక్టర్లు, రైస్ మిల్లుల యజమానులు పాల్గొన్నారు. —————— జిల్లా సమాచార, పౌర సంబంధాల అధికారి కార్యాలయం కామారెడ్డి చే జారీ చేయనైనది.

Share This Post