బారివర్షాలతో అప్రమత్తంగా ఉండాలి :: జిల్లా కలెక్టర్ జి. రవి
పత్రికాప్రకటన తేదిః 06-09-2021
భారి వర్షాలతో అప్రమత్తంగా ఉండాలి :: జిల్లా కలెక్టర్ జి. రవి
జగిత్యాల, సెప్టెంబర్ 06: భారీ వర్షాలతో ఎస్సారెస్పి, కడేం ప్రాజెక్టు లద్వారా లక్షా 50వేల క్యూసెక్ల నీటిని దిగువ గోదావరిలోకి విడుదల చేయడం జరిగినందున గోదావరి పరివాహక, లోతట్టు ప్రాంతాలలో అధికారులు అప్రమత్తం కావాలని జిల్లా కలెక్టర్ జి. రవి పేర్కోన్నారు. సోమవారం వివిధ అన్ని శాఖల అధికారులతో జూమ్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన జిల్లా కలెక్టర్, బారివర్షాలతో ఎగువ ప్రాంతాలలో ప్రాజెక్టులలో నిండిన నీటిని దిగువకు విడుదల చేసినందున గోదావరి పరివాహక మండలాల్లో, లోతట్టు ప్రాంతాలలో అధికారులు అప్రమత్తమై జాగ్రత్తగా ముందస్తు చర్యలు తీసుకోవాలని సూచించారు. రోడ్లపై నుండి నీరు ప్రవహిస్తున్న, ఉప్పొంగి పొర్లుతున్న కాలువల వైపు రాకపోకలను పూర్తిగా మూసివేయాలని, లోతట్టు ప్రాంతాలలోని ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించి, వారికి కావాల్సిన ఆహారం వంటి మౌళిక వసతులు కల్పించాలని అన్నారు. పాతఇళ్లు, గోడలు పడిపోయో స్థితిలో ఉన్నవాటిని గుర్తించి, ఎక్కడాకూడా ఎటువంటి నష్జం వాటిల్లకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని పేర్కోన్నారు. వర్షాల వలన వరదలు ఉదృతంగా ప్రవహించే అవకాశాలు ఉన్నందును గ్రామాలు, పట్టణాలలో అధికారులు ఎప్పటికప్పుడు ప్రత్యేక సానిటేషన్ కార్యకమాలు చేపట్టాలని, వర్షాలతో నీరునిలిచి దోమలు తయారవకండా ఆయిల్ బాల్స్, గంబుషియా చేపలు వదలడం వంటి కార్యక్రమాలను చేపట్టాలని, రోడ్లపై నీరు నిలువకుండ నీటిని తొలగించే చర్యలు తీసుకోవాలని, ఖాళీ ప్రదేశాలలో పిచ్చిమొక్కలు లేకుండా చూడాలని అన్నారు. కరోనా ప్రబావంతో చాలా కాలం తరువాత విద్యాసంస్థలు తెరుచుకున్న సందర్బంగా పాఠశాలు, కళాశాలల పరిసరాలు పరిశుభ్రంగా ఉండేలా చూడాలని, ప్రతిఒక్కరు కోవిడ్ ప్రోటోకాల్ పాటించాలని, టీచర్లు, మద్యాహ్న భోజనం తయారు చేసే వారు, 18 సంవత్సరాలు నిండిన వారు ప్రతిఒక్కరు వ్యాక్సిన్ తీసుకోవాలని, వ్యాక్సిన్ తీసుకోని, తీసుకోవాల్సిన వారి వివరాలను సేకరించి నివేదికను పంపినట్లయితె వారికి రానున్న 2రోజుల్లో వ్యాక్సిన్ అందించే చర్యలు చేపట్టడం జరుగుతుందని పేర్కోన్నారు. పిల్లలో కోవిడ్ పై అవగాహన కల్పించి, ఇంటివద్ద ఎవిధంగా ఉండాలో టీచర్లు తెలియజేయాలని, ప్రజలు ఎక్కువగా గుమ్మిగుడి ఉండే ప్రదేశాలలొ ప్రతిఒక్కరు ఖచ్చితంగా మాస్క్, సామాజికదూరాన్ని పాటించేలా చూడలాని, వర్షాల కారణంగా పాఠశాల పరిసరాలలో నీరునిలిచి పడిపోకుండా చర్యలు చేపట్టాలని సూచించారు. ప్రజావాణి కార్యక్రమం ద్వారా వచ్చే ప్రతిధరఖాస్తుపై అధికారులు చర్యలు తీసుకోని, పెండింగ్ లేకుండా చూడాలని, హరితహారం కార్యక్రమం ద్వారా మోగా పల్లెప్రకృతి వనం, బృహత్ పల్లెప్రకృతి వనాలలో నిర్దేశించుకున్న లక్ష్యాలను సాధించేలా మున్సిపాలిటి, పంచాయితి అధికారులు దృష్టి సారించాలని, వర్షాలు తగ్గిన తరువాత అవసరం మేరకు ఎక్కువ లేబర్ను నియమించి పిటింగ్, ప్లానిటింగ్ పనుల పూర్తిచేయించాలని, ప్లానిటింగ్ పై ప్రత్యేక అధికారులు దృష్టి సారించాలని అన్నారు. నూతన కలెక్టర్ కార్యాలయాల అన్ని శాఖలకు గదులను కేటాయించి పేర్లను వ్రాయించడం జరుగుతుందని, పేర్లలో ఎవైన పొరపాట్లు ఉన్నట్లయితె సంబంధిత అధికారలకు తెలియజేయాలని తెలియజేశారు. ఈ ఆఫీస్ లో ఫైళ్లను వెంటనే పరిష్కరించాలని, ల్యాండ్ అడ్వాన్స్ పోజిషన్ ఇచ్చిన వాటిపై చర్యలు తీసుకోవాలని, భువన్ సర్వేయాప్ మున్సిపలిటి వివరాలను నమోదు చేయాలని, వైకుఠదామాలు నిర్మాణాలు 100% పూర్తిఅయ్యేలా చర్యలు తీసుకోవాలని, బయో ఫెన్సింగ్ ను ఏర్పాటు చేయాలని, ఎస్సి, ఎస్టి కేసుల విషయంలో కాంపన్షేషన్ అందించడంలో అలస్యం జరగరాదని పేర్కోన్నారు. హైకోర్టు కేసులో ఉన్న కేసులపై సకాలాంలో కౌంటర్ లను దాఖలు చేయాలని, కలెక్టర్ కార్యాలయం నుండి కోర్టు కేసుల వివరాలను పరిశీలించాలని ఆదేశించారు. ప్రభుత్వ ఆస్థులు (భూములు) సంబంధిత శాఖల పేరుమీదనే ఉన్నాయా, లేదా సరిచూసుకోవాలని, ప్రైవేటు వారి పేరున ఉన్నట్లయితే వాటిని సరిచేసుకోవాలని పేర్కోన్నారు. విద్యుత్ బకాయిలను చెల్లించాలని పెర్కోన్నారు.
జిల్లా పౌరసంబంధాల అధికారి కార్యాలయం, జగిత్యాల చే జారిచేయనైనది.
బారివర్షాలతో అప్రమత్తంగా ఉండాలి :: జిల్లా కలెక్టర్ జి. రవి
