బాలలపై జరుగుతున్న నేరాలను అరికట్టేందుకు గ్రామస్థాయి నుండి జిల్లా స్థాయి వరకు పెద్ద ఎత్తున అవగాహన కార్యక్రమాలతో పాటు బాలల హక్కులను కాపాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉన్నదని జిల్లా కలెక్టర్ అనుదీప్ తెలిపారు.

మంగళవారం కొత్తగూడెం క్లబ్బులో మహిళా, శిశు, దివ్యాంగులు మరియు వయోవృద్ధుల సంక్షేమ శాఖ ఆద్వర్యంలో అంతర్జాతీయ బాలల దినోత్సవం మరియు బాలల హక్కుల వారోత్సవాలు ముగింపు కార్యక్రమాలను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన కలెక్టర్ బాలలతో కల్సి బెలూన్లు, పావురం ఎగురవేసి జ్యోతి ప్రజ్వలన, నెహ్రూ చిత్ర పటానికి పూల మాలలు వేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ బాలల హక్కుల పరిరక్షణ, బాలలపై జరుగుతున్న అఘాయిత్యాలను రూపుమాపేందుకు పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాలు నిర్వహించాల్సిన అవసరం ఉన్నట్లు చెప్పారు. బాలలపై అఘాయిత్యాలు జరిగినా, బాల్య వివాహాలు, లైంగిక వేధింపులు జరిగిన పక్షంలో నిర్భయంగా చైల్డ్ లైన్ నెంబరు 100కు కానీ సహాయక కేంద్రానికి 1098 కు ఫోన్ చేయాలని ఫోన్ చేసిన వ్యక్తుల సమాచారం అత్యంత గోప్యంగా ఉంటాయని చెప్పారు. దుర్మార్గమైన నేరాలు, ఘోరాలు కనిపిస్తున్నాయని, నమ్మకంతో బాలలను మోసం చేస్తున్నారని వీటన్నింటిని రూపు మాపాలంటే వారి హక్కులు గురించి తెలియచేయాల్సిన బాధ్యత ఉందని చెప్పారు. సేఫ్ టచ్ అన్ సేఫ్ టచ్ చేస్తే కఠిన చర్యలు తీసుకుంటారన్న బయం ప్రజల్లో ఉంటుందని చెప్పారు. గ్రామ, మండల, జిల్లా స్థాయి వరకు బాలల సంక్షేమ పరిరక్షణ సంఘ కమిటీలను బలోపేతం చేయాలని చెప్పారు. ప్రజా ప్రతినిధులు, అధికారులు, స్వచ్చంద సంస్థల నిర్వాహకులు సమన్వయంగా కృషి చేస్తేనే బాలలపై జరుగుతున్న ప్రమాదాలను నివారించగలమని చెప్పారు. మనసు చలించిపోయేటువంటి సంఘటనలు జరుగుతున్నాయని వాటన్నింటిని రూపుమాపాల్సిన అవసరం ఉన్నట్లు చెప్పారు. బాలలపై అసాంఘిక కార్యక్రమాలు ఎవరికి చెప్పాలో, ఎవరిని ఆశ్రయించాలో అన్న వివషయాలపై పాఠశాలల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని చెప్పారు. ఏడాది పొడవునా బాలల హక్కుల దినోత్సవాలు జరగాలని, వారి హక్కులను కాపాడాలని చెప్పారు. ప్రతి అంగన్వాడీ కేంద్రంలో రానున్న మూడు నెలలలోపు పోషక లోపం ఉన్న చిన్నారులు పూర్తి ఆరోగ్యవంతులుగా తీర్చిదిద్దాలని చెప్పారు. ఆరోగ్యవంతమైన సమ సమాజస్థాపన జరగాలంటే ప్రతి అంగన్వాడీ కేంద్రంలో పోషక లోపాలున్న పిల్లలు లేరనే బ్యానర్లు ఏర్పాటు చేయాలని చెప్పారు. ప్రతి అంగన్వాడీ కేంద్రంలో ప్రతి బుధవారం పోషక లోపాలున్న పిల్లలపై తీసుకుంటున్న చర్యలను తల్లులకు వివరించేందుకు సర్పంచులను, గ్రామ పెద్దలను ఆహ్వానించి అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని చెప్పారు. తల్లులకు సమక్షంలోనే పిల్లల బరువు, ఎత్తును పరిశీలన చేసి లోపాలను అధిగమించడానికి తీసుకోవాల్సిన చర్యలను వివరించాలని చెప్పారు. ఏజన్సీ ప్రాంతమైన మన జిల్లాలో పోషకలోపం ఉన్న చిన్నారులు, గర్భిణిలు, తల్లులు ఆరోగ్య పరిరక్షణకు పోషక విలువలున్న ఆహారాన్ని అందిస్తున్నామని సద్వినియోగం చేసుకోవాలని చెప్పారు. సిడిపిఓలు, సూపర్వైజర్లు తల్లులకు తెలియచేస్తే ఎక్కువ ఫలితాలు వస్తాయని, తద్వారా పోషక లోపాలను అధిగమించడానికి అవకాశం ఉన్నట్లు ఆయన వివరించారు. పోషణలోపం లేని కేంద్రాలను తీర్చిదిద్దిన సిబ్బందిని గొప్పగా సన్మానిస్తామని చెప్పారు. అనంతరం జిల్లాలోని 11 ప్రాజెక్టుల పరిధిలో ఆటలు, బాలల హక్కుల పరిరక్షణ, బాల్య వివాహాలు తదితర అంశాలపై నిర్వహించిన వ్యాసరచన పోటీల్లో పాల్గొన్న బాలలకు ప్రశంసా పత్రాలు, మెమెంటోలు జారీ చేశారు. అంగన్వాడీ కేంద్రాల్లో అందిస్తున్న సేవలను ఆన్లైన్ చేసేందుకు మంజూరు చేయబడిన స్మార్ట్ఫోన్లును

 

కలెక్టర్ పంపిణీ చేశారు. అనంతరం బాలల హక్కుల పరిరక్షణ వాల్పోస్టర్లు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా సంక్షేమ అధికారి వరలక్ష్మి, జడ్పీ సిఈఓ విద్యాలత, మైనార్టీ సంక్షేమ అధికారి సంజీవరావు, బాలల హక్కుల పరిరక్షణ అధికారి హరికుమారి, హక్కుల పరిరక్షణ కమిటీ సభ్యులు అంబేద్కర్, సాధిక్పాషా తదితరులు పాల్గొన్నారు.

Share This Post