బాలలు తమ హక్కులను తెలుసుకోవాలి :: జిల్లా కలెక్టర్ డి హరిచందన

బాలలు తమ హక్కులను తెలుసుకోవాలి  జిల్లా కలెక్టర్ డి హరిచందన

బాలల హక్కుల వారోత్సవాల సందర్భంగా గురువారం ఉదయం సంక్షేమ అధికారి ఆధ్వర్యంలో నిర్వహించిన ర్యాలి లో విద్యార్థులకు ఉదేశించి జిల్లా కలెక్టర్ డి హరిచందన మాట్లాడుతూ పిల్లలు వారి యొక్క హక్కులను తెలుసుకోవాలన్నారు. ప్రతి ఒక్కరూ పాటశాలకు వెళ్ళలని సూచించారు. చదువుకొని ఉన్నత స్థాయి కి ఎదగాలన్నారు. మంచిగా చదువుకొని ఉపాద్యాయుల మరియు వారి తల్లి తండ్రులకు మంచి పేరును తిసుకోరవలన్నారు. కలెక్టరేట్ ప్రాంగణం  నుంచి నిర్వహించిన ర్యాలి ని జిల్లా కలెక్టర్ జెండా  ఊపి  ర్యాలి ని  ప్రారంభించారు.  కలెక్టర్ కార్యాలయ  నుండి జిల్లా క్రీడా మైదాన ప్రాంగణం వరకు ర్యాలి ని కొనసాగించడం జరిగింది.

డి.ఎస్.పి మధుసూదన్ రావు మాట్లాడుతూ బాలలందరూ ఒకటేనని అమ్మాయిలు అబ్బాయిలు అనే తేడాలు లేవని అందరికీ సమాన హక్కులు ఉన్నాయని అందరూ వారి వారి నైపుణ్యాల మేరకు కష్టపడి చదవాలని అన్నారు.

ఈ కార్యక్రమంలో  జిల్లా బాలల సంరక్షణ అధికారిణి కుసుమలత, జిల్లా బాలల  సంక్షేమ సమితి వైస్ చైర్ పర్సన్ అశోక్ శ్యామల, జిల్లా విద్యా శాఖ కార్యాలయ సిబ్బంది, జిల్లా బాలల పరిరక్షణ  విభాగ అధికారులు, సఖి చైల్డ్ లైన్ మరియు పాఠశాలల పిఈటిలు  తదితరులు పాల్గొన్నారు.

Share This Post