” బాలల కోసం ప్రధానమంత్రి సహాయ నిధి” పథకంపై వీడియో కాన్ఫరెన్స్ : ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ, జిల్లా పరిషత్ ఛైర్మన్ లోకనాథ్ రెడ్డి

పత్రికా ప్రకటన.       తేది:30.05.2022, వనపర్తి.

తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లలకు ఆర్ధిక సాయం అందించే లక్ష్యంగా ” బాలల కోసం ప్రధాన మంత్రి సహాయ నిధి” పథకాన్ని ప్రవేశపెట్టినట్లు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ సూచించారు.
సోమవారం ఢిల్లీ నుండి ” బాలల కోసం ప్రధానమంత్రి సహాయ నిధి” పథకంపై అన్ని జిల్లాల కలెక్టర్లతో ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రాణాంతకమైన కరోనా బారిన పడి చాలామంది చిన్నారులు తమ తల్లిదండ్రులను, తమ సంరక్షకులను కోల్పోయి అనాథలుగా మారారని, బాధిత చిన్నారులను ఆదుకునేందుకు కేంద్ర ప్రభుత్వం ” బాలల కోసం ప్రధాన మంత్రి సహాయ నిధి” (PM Cares Funds) పథకం ప్రధాన మంత్రి ప్రవేశ పెట్టినట్లు సూచించారు.
ఈ పథకంలో భాగంగా 2020 మార్చి, 11వ.తేది నుండి 2022 ఫిబ్రవరి, 28వ.తేది మధ్య కాలంలో కోవిడ్ కారణంగా తల్లిదండ్రులను, సంరక్షుకులను, తల్లి, తండ్రిని కోల్పోయిన పిల్లలకు పీఎం కేర్స్ నుంచి సహాయం అందించనున్నారని తెలిపారు. PM కేర్స్ ఫర్ చిల్డ్రన్ స్కీమ్ మే 29, 2021న ప్రారంభించారని, పాఠశాలకు వెళ్లే అర్హులైన పిల్లలకు స్కాలర్ షిప్స్, ఆయుష్మాన్ భారత్ – ప్రధాన మంత్రి జనారోగ్య యోజన కింద హెల్త్ కార్డు, పీఎం కేర్ పాస్ బుక్స్, స్నేహ పాత్ర సర్టిఫికెట్లను పిల్లలకు అందజేశారు.
“ప్రధానమంత్రి సహాయ నిధి” పథకం లక్ష్యం పిల్లల సమగ్ర సంరక్షణ, స్థిరమైన రక్షణ కల్పించడం, బాధిత చిన్నారులకు బోర్డింగ్, బసను అందిస్తున్నదని, విద్య, స్కాలర్షిప్ ద్వారా వారికి మంచి భవిష్యత్ ను అందిస్తున్నట్లు తెలిపారు. బాధిత పిల్లలకు 18 సం.లు వయసు వరకు వ్యక్తిగత అవసరాలకు నెలవారి ఆర్థిక సహాయం, 23 సంవత్సరాలు నిండే వరకు వారి పేరిట రూ.10 లక్షల మొత్తాన్ని బ్యాంకులో నిధిగా ప్రభుత్వం డిపాజిట్ చేస్తున్నదని ఆయన తెలిపారు.1 నుండి 12 తరగతుల మధ్యన ఉన్న పిల్లలకు సంవత్సరానికి 20 వేల చొప్పున కాలర్ షిప్ లు, టెక్నికల్ విద్యకు స్వ నత్ స్కాలర్షిప్, 50వేల ఎక్స్గ్రేషియా చెల్లించడం జరుగుతుందని ఆయన సూచించారు. 23 ఏళ్ళు నిండిన అనంతరం డిపాజిట్ చేసిన పది లక్షల మొత్తాన్ని పూర్తిగా బాధితులకు అందించడం జరుగుతుందని సూచించారు. ఈ పథకం కింద బాలలు తమ పేర్లను నమోదు చేసుకొనుటకు “pmcaresforchildren.in పోర్టల్ అందుబాటులో ఉంటుందని ఆయన సూచించారు.
ఈ వీడియో కాన్ఫరెన్స్ లో జిల్లా పరిషత్ ఛైర్మన్ లోకనాథ్ రెడ్డి, డి. డబ్ల్యు. ఓ. పుష్పలత, సి.డబ్ల్యు.సి. అలివేలమ్మ, తదితరులు పాల్గొన్నారు.
…………..
జిల్లా పౌర  సంబంధాల అధికారి, వనపర్తి ద్వారా జారీ చేయనైనది.

Share This Post