బాలల చట్టాలపై ఆ అవగాహన కలిగి ఉండాలి. మాతృత్వం ఒక వారం అందుకు దత్తత మరోమార్గం:::: అదనపు కలెక్టర్ పాటిల్ హేమంత్ కేశవ్.

బాలల దత్తత చట్టాలపై పూర్తి అవగాహన కలిగి ఉండాలని అదనపు కలెక్టర్ పాటిల్ హేమంత్ కేశవ్ అన్నారు. బుధవారం    కలెక్టరేట్ నందు మహిళా, శిశు, దివ్యాంగుల మరియు వయో వృద్ధుల సంక్షేమ శాఖ మరియు జిల్లా బాలల పరిరక్షణ విభాగం, సూర్యాపేట  ఆధ్వర్యంలో   అదనపు కలెక్టర్  పాటిల్ హేమంత్ కేశవ్   చేతుల మీదుగా ”దత్తత” కు సంబంధించిన పోస్టర్ ఆవిష్కరణ పి.డి ఐసీడీస్ జ్యోతి పద్మతో కలసి ఆవిష్కరించారు. ఈ సందర్బంగా  అదనపు కలెక్టర్  మాట్లాడుతూ “చట్ట విరుద్ధంగా పిల్లలను పెంచుకోవటం నేరమని, ప్రభుత్వం నుండి మాత్రమే చట్టబద్ధంగా దత్తత తీసుకోవాలని అలా కాకుండా చట్ట వ్యతిరేకంగా పిల్లలను దత్తతకు ఇచ్చిన మరియు తీసుకున్న వారిపై JJ Act 2015, Section 80 & 81 ప్రకారంగా 3 నుంచి 5 సంవత్సరాలు జైలు శిక్ష మరియు 1 లక్ష రూపాయల జరిమానా విధించబడుతుందని అన్నారు. పిల్లల దత్తత ఆలోచన ఉన్న కుటుంబాలు మహిళ,శిశు,సంక్షేమ శాఖ ఆఫీసు నందు లేదా ఆన్ లైన్ లో www.cara.nic.in అనే వెబ్ సైట్ నందు దత్తత కొరకు దరఖాస్తు చేసుకోవాలని తెలిపినారు.
         ఈ కార్యక్రమాంలో జిల్లా బాలల పరిరక్షణ అధికారి  రవి కుమార్, జిల్లా బాలల పరిరక్షణ విభాగం సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Share This Post