
బాలలపై జరుగుతున్న దాడులు, అక్రమ రవాణాలను అరికట్టడానికి కమిటీలను బలోపేతం చేయడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. జాతీయ బాలల హక్కుల పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో గురువారం రోజున జరిగిన వర్చువల్ సమీక్ష సమావేశంలో కలెక్టర్, ఎస్పీ, అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ, జిల్లాలో బాలల సంక్షేమం కోసం ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని, బాలలపై జరుగుతున్న దాడులను అక్రమ రవాణాను అరికట్టేందుకు కమిటీలతో సమీక్షించడం, పోలీస్ యంత్రాంగం సహకారం తో నివారించడం జరుగుతున్నదని తెలిపారు. ఎస్పీ రాజేష్ చంద్ర మాట్లాడుతూ, జిల్లాలో 70 శాతం సీసీ కెమెరా లతో కవర్ చేయడం జరిగిందని, కమిటీలకు శిక్షణ ఇచ్చి బలోపేతం చేస్తున్నామని తెలిపారు. సఖి టీమ్ లు, షీ టీమ్ ల ద్వారా బాలల పరిరక్షణకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. జిల్లాకు సంబంధించిన నివేదికలను జాతీయ బాలల హక్కుల కమిటీకి సమర్పిస్తామని తెలిపారు. ఈ వర్చువల్ సమావేశంలో వివిధ శాఖలు సంయుక్తంగా ప్రణాళికలతో పని చేయడం జరగాలని జాతీయ కమిటీ సభ్యులు తెలియజేశారు. ఈ వర్చువల్ సమావేశంలో జిల్లా సంక్షేమ అధికారి మిల్కా, జిల్లా పరిషత్ సీఈఓ గణపతి, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డా.నరేందర్ రాథోడ్, జిల్లా విద్య శాఖ అధికారి రవీందర్ రెడ్డి, బాలల పరిరక్షణ కమిటీ చైర్ పర్సన్ జె.వెంకట స్వామి, డీసీపీఓ రాజేంద్ర ప్రసాద్, వివిధ శాఖల అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
…………………………………………………………………. జిల్లా పౌర సంబంధాల అధికారి, ఆదిలాబాదు గారిచే జారీ చేయనైనది.