బాలల బంగారు భవిష్యత్తు కై భద్రతా చర్యలు అత్యంత అవసరం… జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్

ప్రచురణార్థం

బాలల బంగారు భవిష్యత్తు కై భద్రతా చర్యలు అత్యంత అవసరం…

మహబూబాబాద్ జూలై-28:

బాలల బంగారు భవిష్యత్తు కై అధికారులు సమన్వయంతో భద్రతా చర్యలు తీసుకోవాల్సిన ఆవశ్యకత ఉందని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ అన్నారు.

బుధవారం కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఆపరేషన్ ముస్కాన్ కమిటీ సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ గ్రామస్థాయిలో అత్యంత నిఘా అవసరమన్నారు అలాగే గ్రామ సభలలో ఒక అంశంగా చేర్చి ప్రతి ఒక్కరికి అర్థమయ్యేరీతిలో తెలియ చెప్పాలన్నారు అదేవిధంగా చైల్డ్ లైన్ నెంబర్ 1098 ను ప్రతి గ్రామపంచాయతీలో ప్రదర్శింప చేసేందుకు చర్యలు తీసుకోవాలని జిల్లా పంచాయతీ అధికారి ని ఆదేశించారు.

కల్యాణ లక్ష్మి పథకం మంజూరులో ఆధార్ నెంబర్, వయసు నిర్ధారించే వైద్యుల ధ్రువీకరణ పత్రము లను పరిశీలించి పర్యవేక్షణ అనంతరమే మంజూరు చేస్తామన్నారు.
జిల్లాలో తప్పి పోయిన వారిని 98 మందిని గుర్తించామని అందులో 25 మంది ఇతర రాష్ట్రాలకు సంబంధించిన వారు ఉన్నారని తెలిపారు.
అక్రమ దత్తత చెల్లదని చట్ట వ్యతిరేకంగా దత్తత స్వీకరించిన వారు మూడు సంవత్సరములు జైలు శిక్ష అనుభవించాల్సి ఉంటుంది అన్నారు అధికారికంగా చట్టబద్ధంగా 17 మందిని ప్రభుత్వం ఇప్పటివరకు దత్తత ఇచ్చినట్లు తెలియజేశారు. దీని ప్రకారం గానే ఆన్ లైన్ ద్వారా పిల్లలు లేనివారు దత్తత స్వీకరణ కొరకు తమ వివరాలను నమోదు చేసుకోవాలన్నారు.

అలాగే ఆరు నెలల కాలంలో జనవరి నుండి జూన్ వరకు 83 మంది బాల్య వివాహాలు గుర్తించగా 7 ఎఫ్ఐఆర్ నమోదు చేయడం జరిగిందని తెలియజేశారు. ఆపరేషన్ ముస్కాన్ కార్యకలాపాలు మరింతగా కొనసాగాలని అందుకు పోలీస్ శాఖ సహకారం తప్పనిసరిగా ఉంటుంది అన్నారు.

18 సంవత్సరముల లోపు మహిళలకు 21 సంవత్సరముల లోపు పురుషులకు వివాహం చేయడం నేరం అవుతుందన్నారు. అబార్షన్ ల పై ఉక్కుపాదం మోపామన్నారు. జిల్లాలో స్కానింగ్ నిర్వహించిన చర్యలు తీసుకుంటామన్నారు క్రిమినల్ కేసులు నమోదు చేస్తామన్నారు.

బాల్య వివాహాలు జరగకుండా బాల కార్మికులు లేకుండా అధికారులు నిరంతరం పర్యవేక్షించాలని అన్నారు.

ఈ కమిటీ సమావేశంలో asp యోగేష్ గౌతం అదనపు కలెక్టర్ కొమరయ్య జిల్లా మహిళా శిశు సంక్షేమ అధికారి సబిత వైద్య శాఖ అధికారి హరీష్ రాజు, జిల్లా విద్యాశాఖ అధికారి సోమశేఖరశర్మ జిల్లా పంచాయతీ అధికారి రఘువరన్ కార్మిక శాఖ అధికారి రమేష్ చైల్డ్ వెల్ఫేర్ కమిటీ చైర్మన్ నాగ వాణి కమిటీ సభ్యులు అశోక్ డేవిడ్ జిల్లా బాలల పరిరక్షణ అధికారి కమలాకర్ నరేష్ తదితరులు పాల్గొన్నారు.
—————————————-
జిల్లా పౌరసంబంధాల అధికారి కార్యాలయం మహబూబాబాద్ వారిచే జారీ చేయడమైనది

Share This Post